రవితేజ కొత్త చిత్రంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా సూపర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు.ఇదే స్పీడ్ లో ఖిలాడీ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళి సగానికి పైగా కంప్లీట్ చేసేశాడు.

 Sarath Mandava Open Up On Ravi Teja Movie-TeluguStop.com

ఇక ఖిలాడీ మూవీ సెట్స్ పైన ఉండగానే శరత్ మండవ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు.ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేయాలని అనుకున్న సమయానికి కరోనా సెకండ్ వేవ్ అడ్డంకిగా మారింది.

ఇదిలా ఉంటే ఈ మూవీపై గత కొన్ని రోజులుగా రకరకాల గాసిప్స్ వస్తున్నాయి.సినిమా ఆగిపోయిందని, అలాగే సినిమా కథలో మార్పులు చేస్తున్నారని టాక్ నడిచింది.

 Sarath Mandava Open Up On Ravi Teja Movie-రవితేజ కొత్త చిత్రంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిపై దర్శకుడు శరత్ మండవ క్లారిటీ ఇచ్చాడు.రవితేజతో చేయబోయే సినిమా కథపై ప్రస్తుతం వర్క్ జరుగుతుందని చెప్పారు.

కంప్లీట్ స్క్రిప్ట్ సిద్ధమైన దానిని మరింత బెటర్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.అలాగే ఈ సినిమాకి ఎవరూ ఊహించని విధంగా పవర్ ఫుల్ మాస్ టైటిల్ ని పెట్టబోతున్నట్లు చెప్పాడు.

అలాగే సినిమా కోసం ప్రత్యేకంగా థీమ్ సాంగ్ కూడా ఒకటి సిద్ధం చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు.ఆ థీమ్ సాంగ్ కూడా మాసివ్ గా రవితేజ ఎనర్జీ లెవల్స్ ని చూపించే విధంగా ఉండబోతుందని స్పష్టం చేశాడు.

అలాగే లాక్ డౌన్ నుంచి ఉపశమనం లభించి షూటింగ్స్ కి పర్మిషన్ వచ్చిన తర్వాత సెట్స్ పైకి వెళ్తామని చెప్పాడు.మొత్తానికి తెలుగులో కెమెరామెన్ గా కెరియర్ స్టార్ట్ చేసి దర్శకుడుగా మారిన శరత్ మండవ మొదటి సినిమానే రవితేజతో చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.

మరి దీంతో ఎంత వరకు ప్రూవ్ చేసుకుంటాడు అనేది చూడాలి.

#Ravi Teja Movie #Ravi Teja #SarathMandava #Sarath Mandava

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు