సర్కారు వారి పాటలో ఐటెం ఎవరో తెలిసి పోయింది  

Sarakru Vaari Paata Item Pooja Hegde - Telugu Item , Mahesh Babu, Parasuram, Pooja Hegde, Sarkaru Vaari Paata

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ‘సర్కారువారి పాట’ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చకచక జరుగుతోంది.ఈ చిత్రంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోసం ఒక మాస్‌ మసాలా ఐటెం సాంగ్‌ను పెట్టాలని భావిస్తున్నారు.

 Sarakru Vaari Paata Item Song Pooja Hegde

అది కథలో భాగంగా వచ్చేలా దర్శకుడు పరశురామ్‌ ప్లాన్‌ చేశాడట.ప్రస్తుతం ఆ ఐటెం సాంగ్‌ కోసం ఎవరు అయితే బాగుంటుందా అని భావిస్తున్న సమయంలో పూజా హెగ్డేను ఎక్కువ మంది రిఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌.కనుక ఐటెం సాంగ్‌ను ఈమెతో చేయిస్తే సినిమాకు మంచి క్రేజ్‌ వస్తుందని భావిస్తున్నారు.ఇక హీరోయిన్‌ పాత్రకు కియారా అద్వానీ లేదంటే మరో కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.ప్రస్తుతానికి హీరోయిన్‌ విషయంలో తొందర ఏమీ లేదు.

కాని ఐటెం సాంగ్‌కు సంబంధించిన నిర్ణయంను వెంటనే తీసుకోవాలని మేకర్స్‌ భావిస్తున్నారట.

సర్కారు వారి పాటలో ఐటెం ఎవరో తెలిసి పోయింది-Movie-Telugu Tollywood Photo Image

సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నుండి సినిమాను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ఇంకా మహేష్‌బాబు నిర్మిస్తున్నారు.ఈ మూడు నిర్మాణ సంస్థల కాంబోకు మంచి ట్రాక్‌ రికార్డు ఉంది.

సక్సెస్‌లు దక్కించుకున్న చరిత్ర ఉంది.కనుక సర్కారు వారి పాట చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sarakru Vaari Paata Item Song Pooja Hegde Related Telugu News,Photos/Pics,Images..

footer-test