‘రేసుగుర్రం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’తో మరోసారి 50కోట్ల మార్కు చేరుకున్న స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ తర్వాత మరో కమర్షియల్ మూవీ సక్సెస్ కోసం మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బోయపాటి శీనుతో జతకట్టాడు.బన్ని, బోయపాటి కాంబినేషన్లో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై తెరెక్కుతోన్న చిత్రం ‘సరైనోడు’(వర్కింగ్ టైటిల్).
ప్రస్తుతం సినిమా చిత్రీకరణ దశలోనే ఉంది.రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కకుతోన్న ఈ చిత్రాన్ని బన్ని పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.ఇలా ఆలోచించడానికి మూడు కారణాలు కనపడుతున్నాయి.
అందులో మొదటిది ఆరోజు బన్ని బర్త్ డే కావడం, రెండోది ‘రేసుగుర్రం’ కూడా ఏప్రిల్ 11న విడుదలై బన్ని కెరీర్లోనే బెస్ట్ హిట్ మూవీగా నిలవడం అయితే మూడో కారణం ఉగాది పండుగ.ఈరోజున ఆడియెన్స్‌ను థియేటర్స్ వైపు అడుగేయించాలని నిర్మాత అల్లుఅరవింద్ భావిస్తున్నాడట.
మరి ఈ సినిమాతో బన్ని మరో 50 కోట్ల మార్కును సాధించి కమర్షియల్ సక్సెస్ కొట్టాలని ఆశిద్దాం.
.