పాపం : వినాయకుడికి దండం పెట్టి అడ్డంగా బుక్‌ అయిన నిర్మాత  

Sara Alikhan Celabrating Ganesh Chaturthi-saif Alikhan Daughter,sara Alikhan

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సర అలీ ఖాన్‌ చిక్కుల్లో పడింది.మామూలుగా అయితే సినిమా స్టార్స్‌ అన్ని రకాల మతాలకు సంబంధించిన సినిమాల్లో, పాత్రల్లో చేయాల్సి ఉంటుంది.సినిమాలో నటించినప్పుడు ఆయా మతాలకు చెందిన వారు పెద్దగా పట్టించుకోరు...

Sara Alikhan Celabrating Ganesh Chaturthi-saif Alikhan Daughter,sara Alikhan-Sara Alikhan Celabrating Ganesh Chaturthi-Saif Daughter

కాని ఎప్పుడైతే సినిమా షూటింగ్‌ లేకున్నా కూడా ఒక మతంకు చెందిన వారు మరో మతంకు సంబంధించిన దేవుళ్ల గురించి మాట్లాడటం లేదా మరే విధంగా అయినా వేరే మతం గురించి చర్చించినా కూడా సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటారు.గతంలో పలువురు స్టార్స్‌ మరియు సెలబ్రెటీలు ఈ సమస్యను ఎదుర్కొన్నారు.ఇప్పుడు సర అలీ ఖాన్‌ సోషల్‌ మీడియాలో ముస్లీంలతో విమర్శలు ఎదుర్కొంటుంది.

Sara Alikhan Celabrating Ganesh Chaturthi-saif Alikhan Daughter,sara Alikhan-Sara Alikhan Celabrating Ganesh Chaturthi-Saif Daughter

తాజాగా సర అలీ ఖాన్‌ ఒక వినాయకుడి వద్ద నిల్చుని ఆ విగ్రహం చేయి పట్టుకుంది.అది కాస్త దండం పెడుతున్నట్లుగా ఉంది.దాంతో ముస్లీం అయ్యి ఉండి విగ్రహ ఆరాధన చేయడం ఏంటీ అంటూ ముస్లీం పెద్దల నుండి సోషల్‌ మీడియాలో ఉన్న ముస్లీం ఆకతాయిల వరకు అంతా కూడా ఆమెను టార్గెట్‌ చేశారు.ముస్లీంలకు ప్రస్తుత మాసం చాలా పవిత్రమైనది.

ఈ మాసంలో విగ్రహ ఆరాధన ఎంత వరకు కరెక్ట్‌ అంటూ అమెను ప్రశ్నిస్తున్నారు.ఆమెపై వస్తున్న సోషల్‌ మీడియా కామెంట్స్‌ దారుణంగా ఉంటున్నాయి..

ఇస్లాంలో ఉండే అర్హతను నువ్వు కోల్పోయావు.

ముస్లీం పెద్దలు ఈమెను వెంటనే బహిష్కరించాల్సిందే అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.ఆమె బయట కనిపిస్తే బౌతిక దాడి చేసేందుకు కూడా సిద్దం అంటూ ముస్లీంలు కొందరు హెచ్చరించారు.మళ్లీ మళ్లీ ఇతరులు ఇలాంటి పనులు చేయకుండా ఉండాలి అంటే ఈమెకు కఠిన శిక్ష వేయాల్సిందే అంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ముస్లీం పెద్దలు ఆమెకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.అయితే ఇప్పటి వరకు ఈ విషయమై సర కాని, సైఫ్‌ అలీ ఖాన్‌ కాని స్పందించలేదు.