బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సారా అలీఖాన్( Sara Ali Khan ) గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో ఈ బ్యూటీ బిజీగా ఉన్నారు.
అయితే స్టార్ హీరోయిన్ అయినా చిన్న హోటళ్లలో బస చేయడం ద్వారా సారా అలీఖాన్ ప్రశంసలు అందుకుంటున్నారు.ఒకప్పుడు నచ్చిన తిండి, కంటినిండా నిద్ర ఇంతకు మించి ఏం కావాలని సారా అలీఖాన్ భావించేవారట.

అయితే బరువు పెరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో ఆమె తన నిర్ణయాలను మార్చుకోవడం జరిగింది.కొత్త ప్రదేశాలు, కొత్త వ్యక్తులను కలవడాన్ని ఇష్టంగా మార్చుకున్న సారా అలీ ఖాన్ ప్రత్యేకంగా టైమ్ కుదుర్చుకుని మరీ విదేశాలకు వెళ్తున్నారు.అయితే ఎక్కడికి వెళ్లినా సాధారణ అమ్మాయిలానే ఉంటూ సారా అలీ ఖాన్ ప్రశంసలు అందుకుంటూ ఉండటం గమనార్హం.

సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఎక్కడికి వెళ్లినా బడ్జెట్ లోనే ప్రయాణం చేస్తూ ఆమె ప్రశంసలు అందుకుంటున్నారు.తక్కువ మొత్తంలో ప్రయాణం చేయడమే తన తీరు అని ఆమె చెబుతుండటం గమనార్హం.500 రూపాయలతో ఏ ప్రదేశమైనా చుట్టి రాగలనని ఆమె వెల్లడిస్తున్నారు.తక్కువ సామానుకే తన ఓటు అని ఎక్కడికి వెళ్లినా తక్కువ దుస్తులతోనే వెళ్తానని ఆమె చెబుతున్నారు.
స్టార్ అయినప్పటికీ ఇంత సింపుల్ గా ఉండటం సారాకే సాధ్యమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సారా అలీఖాన్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు చెబుతున్నారు.సారా అలీఖాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.సారా అలీఖాన్ ఇన్స్పిరేషనల్ సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ బ్యూటీ రెమ్యునరేషన్( Remuneration ) కూడా భారీగా ఉందని తెలుస్తోంది.