రౌడీ స్టార్ కి ఫ్యాన్ అయిపోయిన సారా ఆలీఖాన్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన ఇమేజ్ ని బాలీవుడ్ రేంజ్ కి పెంచుకోవడానికి పూరీ జగన్నాథ్ తో చేస్తున్న పాన్ ఇండియా మూవీ లైగర్ ని ఉపయోగించుకుంటున్నాడు.ఈ సినిమా షూటింగ్ ని ముంబైలో మళ్ళీ పూరి జగన్నాథ్ స్టార్ట్ చేశాడు.

 Sara Ali Khan Share Photo With Vijay Devarakonda, Tollywood, Bollywood, Liger Mo-TeluguStop.com

దేవరకొండ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా లైగర్ ఉంది.దాంతో పాటు బాలీవుడ్ బడా నిర్మాత దీంతో తెలుగులోకి కూడా నిర్మాతగా ఆగమనం చేస్తున్నాడు.

చార్మీతో కలిసి కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అనన్యా పాండే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.

వీలైనంత వేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పూరి ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇదిలా ఉంటే రౌడీ స్టార్ విజయ్ కి ఫ్యాన్ బేస్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Telugu Bollywood, Charmi, Karan Johar, Liger, Puri Jagannadh, Sara Ali Khan, Tol

అమ్మాయిల ఫాలోయింగ్ అయితే మరీ ఎక్కువగా ఉంది.ఇక బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ అయిన జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ కి తాను పెద్ద ఫ్యాన్ అని గతంలో చెప్పింది.అతను వే అఫ్ స్టైల్ చాలా కొత్తగా ఉంటుందని కూడా పేర్కొంది.అతనితో నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.ఇప్పుడు ఈ జాబితాలో మరో యంగ్ బ్యూటీ సారా ఆలీఖాన్ కూడా చేరిపోయింది.విజయ్ దేవరకొండ మీద తనకున్న అభిమానాన్ని వేలంటైన్ డే సాక్షిగా ఫోటోతో వ్యక్తం చేసింది.

సారా తన ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ తో దిగిన ఫోటోని పోస్ట్ చేసింది.ఫోటోలో సెల్ఫీ క్లిక్ తో ఆ ఇద్దరూ స్మైలీ లుక్ తో కనిపించారు.

“ఫ్యాన్ మూవ్ మెంట్” అంటూ స్టిక్కర్ తో ఈ ఫోటోకి సారా ఆలీఖాన్ క్యాప్షన్ ఇచ్చింది

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube