నాతో నటించే అవకాశం పోగొట్టుకున్నావ్.. హీరోయిన్ కు షాకిచ్చిన సల్మాన్ ఖాన్!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ఈవెంట్లలో అవార్డ్ ఫంక్షన్ లలో చాలా అరుదుగా మాత్రమే ఎదురు పడుతూ ఉంటారు.ఒకవేళ ఎదురుపడ్డారు అంటే కామెంట్స్ చేసుకోవడం అన్నది సాధారణమైన విషయమే.

 Sara Ali Khan Calls Salman Khan 'uncle', He Says She Lost A Chance To Be His Heroine,salman Khan,sara Ali Khan,iifa Awards,bollywood, Funny Video,salaman With Sara Ali Khan,abu Dhabi,iifa Awards 2022-TeluguStop.com

అప్పుడు హీరో హీరోయిన్ లు ఒకరిపై ఒకరు సరదాగా కామెంట్స్ చేసుకుంటూ కామెడీగా నవ్విస్తూ ఉంటారు.అది కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ఘటనలు సీరియస్ గా కూడా మారుతూ ఉంటాయి.

ఇక ఈవెంట్లలో లేదా అవార్డ్ ఫంక్షన్ లో స్టార్ హీరో లపై యంగ్ హీరోయిన్స్ సెటైర్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా రియాక్షన్ ఊహించని విధంగా ఉంటుంది అన్న దానికి ఇప్పుడు మనం తెలుసు కాబోయే సంఘటన చక్కటి ఉదాహరణ.

 Sara Ali Khan Calls Salman Khan 'uncle', He Says She Lost A Chance To Be His Heroine,Salman Khan,Sara Ali Khan,IIFA Awards,Bollywood, Funny Video,Salaman With Sara Ali Khan,Abu Dhabi,IIFA Awards 2022-నాతో నటించే అవకాశం పోగొట్టుకున్నావ్.. హీరోయిన్ కు షాకిచ్చిన సల్మాన్ ఖాన్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలా స్టార్ హీరోలపై యంగ్ హీరోయిన్స్ నెగటివ్ లేదా పాజిటివ్ కామెంట్స్ చేసి ఉండవచ్చు.

ఒక సారి నెగిటివ్ అయితే ఆ హీరో పక్కన నటించే అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు.తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ని అంకుల్ అని పిలిచి సల్మాన్ ఖాన్ తో నటించే అవకాశాన్ని పోగొట్టుకుంది.ఇదే విషయాన్ని స్టేజిపై సల్మాన్ ఖాన్ స్వయంగా తెలిపాడు.

అసలేం జరిగిందంటే.

ఇటీవల ఐఫా 2022 అవార్డ్స్ వేడుక అబుదాబిలో జరిగిన విషయం తెలిసిందే.ఈ వేడుకలో భాగంగా స్టేజిపై సల్మాన్ ఖాన్, సారా అలీ ఖాన్ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు.ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ గురించి సారా అలీ ఖాన్ మాట్లాడుతూనే స్టేజిపై అందరి ముందు సల్మాన్ అంకుల్ అని అనేసింది.

దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు.అప్పుడు సల్మాన్ ఖాన్ నువ్వు నా సరసన నటించే అవకాశం త్వరలో వచ్చేదేమో కానీ నువ్వు నన్ను అంకుల్ అని పిలిచావు కదా ఆ సినిమా ఛాన్స్ లేదు నీకు అని అంటాడు.

అప్పుడు సల్మాన్ ఖాన్ మాటలకు కంగు తిన్న సారా అలీ ఖాన్.ఆ విషయంపై వెంటనే స్పందిస్తూ మీరే కదా అంకుల్ అని పిలవమన్నారు అని ఉంటుంది.

ఆ తర్వాత ఒక సాంగ్ రావడంతో కూల్ అయిపోయిన సల్మాన్ ఖాన్ సారా అలీ ఖాన్ తో కలిసి స్టేజి మీద స్టెప్పులు వేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వారి మధ్య కన్వర్జేషన్ చూసి అక్కడికి వచ్చిన సెలబ్రిటీలు అందరూ పల్లున నవ్వేసుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube