ప్లీజ్ నన్ను క్షమించండి అంటూ ఫోటోగ్రాఫర్లను వేడుకున్న నటి.. కారణం?

సాధారణంగా అభిమానులు వారి అభిమాన హీరో హీరోయిన్ లు కనపడితే ఫోటోలు తీసుకోవాలని, వారి ఆటోగ్రాఫ్ కోసమని ఎగబడుతుంటారు.ఫోటోగ్రాఫర్లు సైతం సెలబ్రిటీలు కనపడితే వారి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటారు.

 Bollywood Actress Sara Ali Khan Apologizes Pushing The Photographers Details,  S-TeluguStop.com

అయితే ఇలా ఫోటోలు తీసుకొని నేపథ్యంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.ఇలాంటి సందర్భాలలోనే కొన్ని కొన్ని సార్లు ఆ సెలబ్రిటీలు వారి సహనాన్ని కోల్పోయి అభిమానుల పై చేయి చేసుకోవడం, తిట్టడం, అరవడం లాంటివి చేస్తూ ఉంటారు.

కానీ ఒక బాలీవుడ్ హీరోయిన్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ప్రవర్తించింది.ఆమె ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్. ఈమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.సారా అలీ ఖాన్‌ రాబోతున్న మూవీ ఆత్రంగిరే నుంచి చక్‌ చక్‌ అనే పాటను లాంచ్‌ ను ముంబైలోని మిథిబాయి కాలేజ్‌ లో ఈ వేడుకను ఏర్పాటు చేశారు.

వేడుక అనంతరం అక్కడినుంచి వెళ్లేటప్పుడు ఆమె సెక్యూరిటీ గార్డ్స్ ఎవరో ఒక ఫొటోగ్రాఫర్‌ను తోసినట్టు ఉండగా అది చూసిన సారా అలీ ఖాన్ కారు ఆపి ఎవరిని కిందకు తోసారు అని సెక్యురిటీ గార్డ్స్‌ను ప్రశ్నించింది.

దానికి వారు ఎవరూ కింద పడలేదు అని సమాధానం ఇచ్చారు.దానికి లేదు లేదు, మీరు నెట్టేసిన అతను అ‍ప్పటికే వెళ్లిపోయాడని సెక్యూరిటీ గార్డ్స్‌ని తిరిగి నిలదీసింది.ఫొటోగ్రాఫర్స్‌ కు సారీ చెప్తున్నా, థాంక్యూ అని చెప్పి సెక్యూరిటీ గార్డ్స్‌తో ఇలా ప్రవర్తించవద్దు అంటూ గట్టిగా చెప్పింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube