సప్తగిరి ఇకనైనా మారు లేదంటే దుఖాణం సర్దేసుకోవాల్సిందే  

Sapthagiri Please Stop The Hero Oriented Movies-premakatha Chitram,sapthagiri,sapthagiri Express

పరుగు చిత్రంతో కమెడియన్‌గా గుర్తింపు దక్కించుకున్న సప్తగిరి ప్రేమ కథా చిత్రమ్‌తో ఒక్కసారిగా స్టార్‌ అయ్యాడు. ఆ సినిమాతో సప్తగిరి దశ తిరిగి పోయింది. కమెడియన్‌గా చాలా బిజీ అయ్యాడు..

సప్తగిరి ఇకనైనా మారు లేదంటే దుఖాణం సర్దేసుకోవాల్సిందే-Sapthagiri Please Stop The Hero Oriented Movies

అయితే ఆ సమయంలోనే హీరోగా అవకాశాలు రావడంతో సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ అంటూ సినిమాను చేయడం జరిగింది. ఆ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో పాటు డబ్బులు కూడా వచ్చాయి. ఇక మొదటి సినిమా సక్సెస్‌ అయ్యింది కదా అని వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

రెండవ సినిమా సప్తగిరి ఎల్‌ఎల్‌బి సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది. అయినా కూడా నిరుత్సాహం చెందకుండా సప్తగిరి హీరోగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సమయంలో చిన్న చిన్న కామెడీ రోల్స్‌ను కాదనుకున్నాడు.

ఫుల్‌లెంగ్త్‌ కామెడీ రోల్స్‌ అయితేనే చేస్తానంటూ చెబుతూ ఉన్న సప్తగిరి తాజాగా ‘వజ్రకవచధర గోవింద’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.

సప్తగిరి వరుసగా హీరోగా ఫెయిల్‌ అవుతున్నా కూడా కొందరి మాటలు విని మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రం ఫలితంతో అయినా మేల్కొని ఇకపై హీరో వేశాలకు గుడ్‌ బై చెప్పి కమెడియన్‌గా ప్రయత్నాలు చేయాలని సన్నిహితులు చెబుతున్నారు. ఇంకా కూడా హీరోగానే చేస్తాను అంటే మాత్రం మనోడు పూర్తిగా దుఖాణం సర్దేయాల్సిందే అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.

మరి ఆ సలహాలను సప్తగిరి ఫాలో అవుతాడా లేదంటే మరో సినిమాలో హీరోగా నటిస్తాడా అనేది చూడాలి.