పాన్ ఇండియా మూవీతో వస్తున్న సప్తగిరి

టాలీవుడ్ కమెడియన్‌గా సప్తగిరి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.అయితే చాలా మంది కమెడియన్ల లాగే ఆయన కూడా హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

 Sapthagiri New Movie Title Eight, Sapthagiri, Eight Movie, Pan India, Comedian S-TeluguStop.com

ఇప్పటికే రెండు మూడు చిత్రాలు హీరోగా చేసిన సప్తగిరి బ్లాక్‌బస్టర్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు.అయినా కూడా తన సినిమాల జోరును ఏమాత్రం తగ్గకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

తాజాగా సప్తగిరి హీరోగా మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

ఎయిట్’ అనే ఆసక్తికర టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సప్తగిరి.

పూర్తి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సూర్యాస్ అనే డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నూతన సంవత్సరం కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో సప్తగిరి స్టైల్‌గా సూట్ వేసుకుని సిగరెట్ తాగుతూ ఉండగా, ఆయన చేతికి రక్తపు మరకలు ఉన్నాయి.దీంతో ఈ సినిమా ఎలాంటి థ్రిలర్ అంశాలతో వస్తుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇక ఈ సినిమాకు ‘ఎయిట్’ అనే టైటిల్ మరింత ఆసక్తికరంగా మార్చింది.కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

యూనివర్సల్ కథతో వస్తున్న ఈ సినిమాలో సప్తగిరి మార్క్ కామెడీకి కొదువే ఉండదని చిత్ర యూనిట్ అంటోంది.రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్షన్ నంబ‌ర్ 4గా వస్తున్న ఈ సినిమాతో సప్తగిరి మరోసారి హిట్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఏదేమైనా సప్తగిరి పాన్ ఇండియా మూవీ అంటే అందులో ఏదో కథ ఉంటుంది అని ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.మరి ఈ సినిమాతో నిజంగానే మన సప్తగిరి పాన్ ఇండియా స్టార్ అయిపోతాడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube