గూడుపుఠాణి ఏంటో చెప్పబోతున్న సప్తగిరి... హీరోగా నెక్స్ట్ సినిమా

ఇండియన్ సినిమాలో కమెడియన్ నుంచి హీరోలుగా మారి సక్సెస్ అయిన వాళ్ళు కొంత మంది ఉన్నారు.అలాగే హీరోగా మారిన తర్వాత కంప్లీట్ గా కెరియర్ ని కోల్పోయి అవకాశాలకి దూరం అయినవారు ఉన్నారు.

 Sapthagiri New Movie Guduputani First Look, Tollywood, Comedian, Eight Movie, So-TeluguStop.com

అయితే మధ్యలో తేరుకొని పూర్తిస్థాయిలో కమెడియన్ గానే కొనసాగిన వారు ఉన్నారు.సీనియర్ కమెడియన్స్ రాజబాబు, రేలంగి, పద్మనాభం వంటి వారు హీరోలుగా, అలాగే కమెడియన్స్ గా రాణించారు.

హీరోలుగా చేసి ఫ్లాప్ లు కొట్టి మళ్ళీ బ్యాక్ టూ కామెడీ అంటూ వచ్చేసారు.అలాగే నెక్స్ట్ జెనరేషన్ లో బ్రహ్మానందం ఓ రెండు సినిమాలలో హీరోగా నటించాడు.

అయితే వర్క్ అవుట్ కాకపోవడం కమెడియన్ గా సెటిల్ అయ్యాడు.అలీ కూడా హీరోగా సూపర్ హిట్స్ కొట్టాడు.

అయినా కూడా కామెడీని వదలకుండా చేస్తూ రావడం వలన అతను స్టార్ కమెడియన్ గా సక్సెస్ అయ్యాడు.
అలాగే సునీల్ హీరోగా వరుస సక్సెస్ లు అందుకొని కమర్షియల్ హీరో అవ్వాలని ప్రయత్నం చేసిన వర్క్ అవుట్ కాలేదు.

ప్రస్తుతం కామెడీ పాత్రలు కూడా అనుకున్న స్థాయిలో రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుతం కమెడియన్ గా మంచి భవిష్యత్తు ఉన్న దాన్ని వదులుకొని హీరోగానే సినిమాలు చేయాలని ప్రయత్నం చేస్తున్న నటుడు సప్తగిరి.

ఇప్పటికే సప్తగిరి మూడు సినిమాలు హీరోగా చేసి ప్రూవ్ చేసుకున్నాడు.కమర్షియల్ సక్సెస్ కాకుండా ఒకే అనిపించుకున్నారు.ఇప్పుడు హీరోగా ఓ థ్రిల్లర్ కామెడీతో తాజాగా ఎనౌన్స్ చేశారు.గూడుపుఠాణి టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.

దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ ని తాజాగా రిలీజ్ చేశారు.ఫస్ట్ లుక్ పోస్టర్ కాస్తా ఇంటరెస్టింగ్ గా సప్తగిరి దేనికోసమో వెతుకుతున్నట్లు ఉంది.

మరి ఈ మూవీ అతనికి కమర్షియల్ సక్సెస్ అందించి హీరోగా నిలబెడుతుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube