మహేష్‌కు అమ్మగా నాగ్‌ హీరోయిన్‌?

నిన్నటి తరం హీరోయిన్‌లు నేటి తరం హీరోలకు హీరోయిన్‌లకు తల్లిగా అక్కగా నటిస్తూ వస్తున్న విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో నదియాతో పాటు ఇంకా ఎంతో మంది నిన్నటి తరం హీరోయిన్‌లు ఇప్పటికే టాలీవుడ్‌లో సందడి చేశారు.

 Gracy Singh To Act As Mahesh’s Mother-TeluguStop.com

ఈ నేపథ్యంలో మరో హీరోయిన్‌ త్వరలో తల్లిగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది.నాగార్జున సరసన ‘సంతోషం’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన గ్రేసి సింగ్‌ త్వరలో మహేష్‌బాబుకు తల్లిగా నటించబోతుంది.

మహేష్‌బాబు, శృతిహాసన్‌ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మొదట నదియాను ఎంపిక చేయాలనుకున్నారు.అయితే కొత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయం ఉన్న గ్రేసి సింగ్‌ను ఎంపిక చేయడం జరిగింది.

మహేష్‌బాబు, గ్రేసి సింగ్‌ల మధ్య సీన్స్‌ను త్వరలో తెరకెక్కించబోతున్నారు.అయితే ఈ సినిమాలో గ్రేసి సింగ్‌ పాత్ర చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమా తర్వాత నదియాకు మల్లే వరుసగా గ్రేసి సింగ్‌కు కూడా ఆఫర్లు వచ్చే అవకాశముందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube