గోల్కొండ హై స్కూల్ సినిమాతో టాలీవుడ్ లోకి నటుడుగా అడుగుపెట్టిన టాలెంటెడ్ యాక్టర్ సంతోష్ శోభన్.మొదటి సినిమాతోనే నటుడిగా మెప్పించిన సంతోష్ తరువాత కొంత గ్యాప్ తీసుకొని తను నేను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తరువాత పేపర్ బాయ్ అనే సినిమాలో హీరోగా చేశాడు.ఈ రెండు సినిమాలు అతనికి ఐడెంటిటీ అయితే పెంచాయి తప్ప పెద్దగా సక్సెస్ అందించలేదు.
వర్షం దర్శకుడు శోభన్ కొడుకే సంతోష్ అనే విషయం అందరికి తెలిసిందే.ఇక తన స్నేహితుడు కొడుకు కావడంతో సంతోష్ కి హీరోగా మూడో అవకాశం ప్రభాస్ తన హోం బ్యానర్ అయిన యూవీలో వచ్చేలా చేశాడు.
యూవీ బ్యానర్ 2 అయిన యూవీ కాన్సెప్ట్స్ లో ఏక్ మినీ కథ అనే మూవీతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయ్యింది.

ఈ మూవీ రిలీజ్ తర్వాత మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.అడల్ట్ కంటెంట్ అయినా కూడా ఎక్కడ వల్గారిటీకి తావు లేకుండా క్లీన్ కామెడీని తెరపై అద్బుతంగా పండించారని ప్రశంసలు లభించాయి.ఇక హీరో సంతోష్ కి కూడా మొదటి సక్సెస్ రావడంతో పాటు నటుడిగా మార్కులు కూడా పడ్డాయి.ఇప్పుడు ఈ సినిమా హిట్ తో సంతోష్ శోభన్ ఏకంగా మూడు సినిమాలు చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు.
వాటిలో రెండు సినిమాలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లోనే కావడం విశేషం.ఇక మరో సినిమా కూడా ఓ పెద్ద బ్యానర్ లో ఉండబోతుందని తెలుస్తుంది.దిల్ రాజు కూడా సంతోష్ శోభన్ తో ఓ మూవీని చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.మొత్తానికి హీరోగా నిలబడటానికి ఇన్నేళ్ళు ఇబ్బంది పడ్డ సంతోష్ శోభన్ ఏక్ మినీ కథతో ట్రాక్ లోకి వచ్చాడని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది.