వర్షం దర్శకుడి కొడుకు కొత్త సినిమా అప్‌డేట్‌

ప్రభాస్‌ కు వర్షం వంటి బిగ్గెస్ట్‌ సూపర్‌ హిట్‌ ను ఇచ్చిన దర్శకుడు శోభన్‌.ఆయన అనారోగ్య కారణంగా తక్కువ వయసులోనే మృతి చెందాడు.ఆయన కుమారుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా పరిచయం అయ్యాడు.మొదటి సినిమాతో పర్వా లేదు అనిపించుకున్నాడు.అయితే అతడి మొదటి సినిమా విషయంలో జరిగిన తప్పు రెండవ సినిమా విషయంలో జరగకూడదు అనే ఉద్దేశ్యంతో చాలా గ్యాప్‌ తీసుకున్నాడు.ఎట్టకేలకు సంతోష్‌ శోభన్‌ రెండవ సినిమాకు సంబంధించిన చర్చ మొదలైంది.

 Varsham Movie Director Son Santosh Shobhan Next Movie In Prabhas Own Banner, Uv-TeluguStop.com

తనకు వర్షం వంటి హిట్‌ ఇచ్చిన దర్శకుడు శోభన్‌ కొడుకుకు తాను కూడా ఏదైనా చేయాలని భావించిన ప్రభాస్‌ తన హోం బ్యానర్‌ లో ఆయనతో సినిమాను నిర్మించాలని వంశీ ప్రమోద్‌ లకు సూచించాడు.ఒక కొత్త దర్శకుడిని మంచి సబ్జెక్ట్‌ ను ఎంపిక చేసిన యూవీ వారు ప్రస్తుతం సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కు ఎవరు ఎంపిక అవుతారు అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.

Telugu Pabhas, Santosh Shobhan, Shobhan, Uv, Varsham, Varshamson-

మోడల్‌ గా గుర్తింపు దక్కించుకున్న కావ్య తప్పర్‌ ఆ తర్వాత హీరోయిన్‌ గా కూడా పరిచయం అయ్యి పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కించుకుంది.దాంతో ఆమెను హీరోయిన్‌ గా ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించి వచ్చే సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించారు.

అప్పటి వరకు థియేటర్‌ లు ఓపెన్‌ అవుతాయి కనుక థియేటర్లలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.లేదంటే ఓటీటీలో అయినా విడుదలకు యూవీ వారు సిద్దపడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube