హీరోకి అది చిన్నది.. అదే కథాంశంతో సినిమా.. ఆకట్టుకున్న ఏక్ మినీ కథ ట్రైలర్..!

వర్షం డైరక్టర్ శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా యువి కాన్సెప్ట్స్, మ్యాంగో మూవీస్ కలిసి నిర్మిస్తున్న సినిమా ఏక్ మినీ కథ.సక్సెస్ ఫుల్ డైరక్టర్ మేర్లపాక గాధీ కథ అందించిన ఈ సినిమాను కార్తిక్ రాపోలు డైరెక్ట్ చేశారు.

 Santosh Shobhan Ek Mini Katha Trailer Released, Ek Mini Katha, Santosh Shobhan ,-TeluguStop.com

సినిమాలో సంతోష్ శోభన్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించారు.ఈ సినిమాను ఈ నెల 27న అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు.

రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ గా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ చూస్తే సినిమా కథ ఏంటన్నది అర్ధమవుతుంది.

తన చిన్నదైన భాగంతో హీరో పడే ఇబ్బందులు ఏంటన్నది సినిమాలో చూడాల్సిందే.ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.

థియేటర్లలో రావాల్సిన ఈ సినిమా ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో తెలియదు కాబట్టి సినిమాను అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు.తను నేను, పేపర్ బోయ్ సినిమాల్లో నటించిన సంతోష్ శోభన్ తన థర్డ్ మూవీగా ఏక్ మినీ కథతో వస్తున్నాడు.

సినిమాలో సుదర్శన్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, శ్రద్ధాదాస్, , సప్తగిరి, జబర్దస్త్ అప్పారావు, జెమిని సురేష్ తదితరులు నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తే సినిమా ప్రేషకులను అలరించడం పక్కా అనేలా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube