స్వాతి మ్యాగజైన్‌ లో సమంత సమాధానం ఆధారంగా 'ఏక్‌ మినీ కథ'

సంతోష్‌ శోభన్‌ హీరోగా రూపొందిన ఏక్‌ మినీ కథ సినిమా ఈ వారం ప్రైమ్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు ప్రభాస్ మరియు చరణ్‌ లు మద్దతుగా నిలిచారు.

 Santhosh Sobhan Movie Ek Mini Katha Story Intresting News-TeluguStop.com

సోషల్ మీడియాలో ఈ సినిమా కోసం పబ్లిసిటీ చేశారు.దాంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

అంచనాలు ఏమాత్రం తగ్గకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేందుకు నిదర్శణంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ట్రైలర్‌ కు వస్తున్న రెస్పాన్స్ విభిన్నంగా ఉంది.

 Santhosh Sobhan Movie Ek Mini Katha Story Intresting News-స్వాతి మ్యాగజైన్‌ లో సమంత సమాధానం ఆధారంగా ఏక్‌ మినీ కథ’-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బోల్డ్‌ కంటెంట్‌ తో దుమ్ము రేపుతున్న ఈ ఏక్‌ మినీ కథ ట్రైలర్‌ భారీ వ్యూస్‌ దిశగా దూసుకు పోతున్నాయి.ఇక ఈ సినిమాకు మేర్ల పాక గాంధీ కథను అందించాడు.

సినిమా ప్రమోషన్‌ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

రచయిత మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.

నేను చిన్నప్పుడు ఇంటికి వచ్చే స్వాతి మ్యాగజైన్‌ను చదివేవాడిని.ఆ మ్యాగజైన్ లో డాక్టర్‌ సమరం ను లైగింక సంబంధిత సమస్యలు మరియు ప్రశ్నలు అడిగే వారు.

ఆ ప్రశ్నల్లో నన్ను ఒక ప్రశ్న ఆకర్షించింది.ఒక వ్యక్తి తన అంగం చిన్నగా ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ లెటర్‌ రాశాడు.

దాంతో సమరం ఇచ్చిన సమాధానం నాకు మరింతగా ఆసక్తికరంగా అనిపించింది.ఏ వ్యక్తి అయితే తన అంగం చిన్నగా ఉందని చెప్పాడో అతడి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఊహించుకుంటూ సినిమా కథను రాశాను.

ఆ సినిమా కు సంబంధించిన కథ విషయంలో ఫన్ క్రియేట్‌ చేయడంతో పాటు ఆలోచింపజేసే విధంగా కూడా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.అమెజాన్ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ సినిమా తో కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

#Santhosh Sobhan #Prime #Ek Katha #Prime

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు