రూ.2.5 కోట్ల సినిమాకు రూ.10 కోట్ల బిజినెస్‌.. యూవీ వారి లక్‌

సంతోష్‌ శోభన్‌ హీరోగా రూపొందిన ఏక్ మినీ కథ ఇటీవలే అమెజాన్ లో స్ట్రీమింగ్‌ మొదలు అయిన విషయం తెల్సిందే.ఏక్ మినీ కథ సినిమా కోసం ప్రభాస్ మరియు రామ్‌ చరణ్‌ లు ప్రమోషన్ చేశారు.

 Santhosh Sobhan Ek Mini Katha Movie Budget And Profits-TeluguStop.com

యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మించిన ఈ సినిమా కు పాజిటివ్ టాక్ దక్కింది.సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం రెండున్నర కోట్లతో ఈ సినిమా ను యూవీ వారు తెరకెక్కించారు.డిజిటల్‌ రైట్స్, శాటిలైట్‌ రైట్స్ ఇంకా ఇతర రైట్స్ మొత్తం కలిపి రూ.10 కోట్లకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది.సినిమా పై ఏకంగా ఏడున్నర కోట్లు యూవీ వారికి మిగిలాయి.సినిమా ను ప్రభాస్ కోరిక మేరకు యూవీ వారు సంతోష్‌ శోభన్‌ తో తెరకెక్కించారు.వర్షం సినిమా తో తనను హీరోగా నిలబెట్టినందుకు గాను శోభన్‌ తనయుడు సంతోష్‌ ను హీరోగా నిలబెట్టాలని ప్రభాస్‌ భావించాడు.అందుకే ఆయనతో వరుసగా తన హోం బ్యానర్‌ వంటి యూవీ క్రియేషన్స్‌ లో సినిమా లు నిర్మింపజేస్తున్నాడు.

ఏక్‌ మినీ కథతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న యూవీ వారు ఆ మొత్తంను మళ్లీ సంతోష్‌ శోభన్‌ పైనే పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌ హీరోగా దాదాపుగా అయిదు నుండి ఆరు కోట్ల బడ్జెట్‌ తో మరో లో బడ్జెట్‌ సినిమా ను కూడా నిర్మించేందుకు సిద్దం అయ్యారు.

 Santhosh Sobhan Ek Mini Katha Movie Budget And Profits-రూ.2.5 కోట్ల సినిమాకు రూ.10 కోట్ల బిజినెస్‌.. యూవీ వారి లక్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈసారి మరింత కమర్షియల్‌ మూవీగా సంతోష్‌ శోభన్‌ నటించబోతున్న సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Telugu Amazon Stream Movie, Ek Mini Katha, Ek Mini Katha Hero, Film News, Maruthi, Prabhas Ram Charan, Santhosh Sobhan, Santosh Sobhan Next Movie, Uv Creation-Movie

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను కేవలం రెండు నుండి మూడు నెలల్లోనే పూర్తి చేసి థియేటర్‌ లేదా ఓటీటీ ఆ సమయంకు ఏది వీలు అయితే ఆ ప్లాట్‌ ఫామ్ ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నాడు.ఏక్‌ మినీ కథ లో సంతోష్‌ లో కామెడీ యాంగిల్‌ ను చూశాం.ఇక ఆయన తదుపరి సినిమా లో అంతకు మించి అన్నట్లుగా చూడబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం మారుతి అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ను ముగించే పనిలో ఉన్నాడు.షూటింగ్‌ లు మొదలు అయిన వెంటనే కొత్త సినిమా పట్టాలెక్కబోతుంది.

#Santhosh Sobhan #SantoshSobhan #Ek Mini Katha #AmazonStream #Maruthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు