ఇక్కడ సూపర్ స్టార్.. అక్కడ పవర్ స్టార్.. హిట్ ఎవరికి ఫట్ ఎవరికి?

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు అన్ని ఏదైనా పండుగ బరిలో దిగుతూ ప్రేక్షకులకు గట్టి పోటీని ఇస్తూ నిలబెడతాయి.ఈ క్రమంలోనే ప్రతియేటా సంక్రాంతి బరిలో ఎన్నో సినిమాలు పోటీపడుతుంటాయి.

 Sankranti 2022 Movies List Top Upcoming Tollywood Movies Sankranti 2022, Mahehs-TeluguStop.com

ఈ క్రమంలోనే గతంలో సంక్రాంతి బరిలో దిగిన సినిమాలన్నీ ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు సినిమాలన్నీ వరుసగా విడుదలవుతూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాయని చెప్పవచ్చు.

సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటన చేశారు.అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి భీమ్లా నాయక్ జనవరి 12వ తేదీ విడుదల కాబోతుంది.

అలాగే జనవరి 13న పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారి వారి పాట విడుదల కానుంది.ఇలా ఒకరోజు వ్యత్యాసంతో ఒకవైపు పవర్ స్టార్ మరోవైపు సూపర్ స్టార్ గట్టిపోటీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మరి వీరిలో విజయం ఎవరు సాధిస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది.

వీటితో పాటు జనవరి 14వ తేదీన రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

వీటితో పాటు విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్3, నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా నటిస్తున్న అటువంటి బంగార్రాజు చిత్రాలు కూడా సంక్రాంతి బరిలోకి దిగనున్నాయి.అయితే ఈ సంక్రాంతి పండుగ ఎంత మంది హీరో దర్శకుల ఖాతాలలో విజయాలను వేస్తుందో వేచిచూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube