జనవరిలో జాతర షురూ.. ఈసారి సంక్రాంతి మాములుగా ఉండదు!

మన టాలీవుడ్ లో అతి పెద్ద సీజన్ ఏదంటే వెంటనే సంక్రాంతి అని చెప్తాము.సంక్రాంతి సందడి అంటేనే వేరే విధంగా ఉంటుంది.

 Sankranti 2022 Festival To Box Office Clash, Sankranti 2022, Sarkaru Vaari Paata-TeluguStop.com

మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను చిన్న పెద్దలు కలిసి ఆనందంగా జరుపు కుంటాము.అలాగే సంక్రాంతి అంటే పిండి వంటలు, కోడి పందాలు ఎలా గుర్తుకు వస్తాయో అలాగే మంచి మంచి సినిమాలు కూడా విడుదల అవుతాయి అని మనకు గుర్తుకు వస్తాయి.

ముందు నుండి కూడా మన టాలీవుడ్ లో స్టార్ హీరోలు సంక్రాంతి పండుగకు సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది.ఈ సీజన్ కు సినిమాలు విడుదల అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకున్న మంచి కలెక్షన్లు వస్తాయి అని నమ్మకం.

అందుకే చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకు సంక్రాంతి సీజన్ కు విడుదల అయ్యేందుకు పోటీ పడతాయి.

ఎప్పుడు సంక్రాంతికి రెండు నుండి మూడు పెద్ద సినిమాలు మాత్రమే విడుదల అయ్యేవి.

కానీ ఈసారి మాత్రం వరుసగా సినిమాలను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ లు రెడీ అవుతున్నారు.ఒకటి రెండు విడుదల అయితేనే పోటీ గట్టిగ ఉంటుంది.

అలాంటిది అన్ని సినిమాలు క్యూ కడితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.ఈసారి జనవరి నెల మొత్తం పెద్ద పెద్ద సినిమాలతో టాలీవుడ్ లో థియేటర్స్ కలకల లాడబోతున్నాయి.

ఈసారి సంక్రాంతి సందడి నెల రోజులు ఉండేలాగా కనిపిస్తుంది.జనవరి నెల మొత్తం పెద్ద పెద్ద సినిమాలు బరిలోకి దిగబోతున్నాయి.ఇప్పటికే మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్ డేట్ లు ఫిక్స్ చేసుకున్నాయి.ఇక ఈ మూడు సినిమాలే సంక్రాంతి మూడు రోజులు బుక్ అయిపోయాయి.

ఇక ఆ తర్వాత కూడా వరుసగా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి.

Telugu Acharya, Akhanda, Bangarraju, Bheemla Nayak, Radhe Shyam, Sankranti, Sark

మెగాస్టార్ ఆచార్య, బాలయ్య అఖండ, వేంకటేష్ ఎఫ్ 3, నాగార్జున బంగార్రాజు కూడా బరిలో దిగేందుకు సిద్ధం అవుతున్నాయి.ఒకే నెలలో నలుగురు సీనియర్ హీరోల సినిమాలు విడుదల అవ్వబోతుండడం ఇక్కడ మరొక విశేషంగా చెప్పుకోవచ్చు.ఇక టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.

Telugu Acharya, Akhanda, Bangarraju, Bheemla Nayak, Radhe Shyam, Sankranti, Sark

ఈ సినిమా కూడా జనవరి లోనే విడుదల కాబోతున్నట్టు ఇప్పటికే టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా దసరాకే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా వల్ల ఉత్తరాదిలో థియేటర్స్ ఓపెన్ అవ్వక పోవడంతో ఈ సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది.ఇక ఈ సినిమా కూడా జనవరి లోనే రాబోతుందని వార్తలు వస్తున్నాయి.అందుకే ఈసారి సంక్రాంతి నెల మాములుగా ఉండదనే చెప్పాలి.అందుకే ఈ నెల మొత్తం సినిమాల సందడి కనిపించి ప్రేక్షకులను అలరించడానికి జనవరి నెల సిద్ధం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube