స్టార్ హీరో బాలయ్య అభిమానులకు సంక్రాంతి కానుక ఇదే!

Sankranthi Speical Gift For Star Hero Balakrishna Fans

స్టార్ హీరో బాలకృష్ణకు 2021 సంవత్సరం కలిసొచ్చింది.ఒకవైపు అఖండ సినిమాతో మరోవైపు అన్ స్టాపబుల్ షోతో బాలయ్య సత్తా చాటారు.

 Sankranthi Speical Gift For Star Hero Balakrishna Fans-TeluguStop.com

అన్ స్టాపబుల్ షో రికార్డ్ స్థాయిలో ఐఎండీబీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.ఎమ్మెల్యేగా కూడా యాక్టివ్ గా ఉంటూ బాలయ్య హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారు.

అఖండ సినిమా హవా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఇప్పటికీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 Sankranthi Speical Gift For Star Hero Balakrishna Fans-స్టార్ హీరో బాలయ్య అభిమానులకు సంక్రాంతి కానుక ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అఖండ సినిమా వచ్చే వారం నుంచి హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

అయితే సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా నుంచి అఖండ టైటిల్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజైంది.జనవరి నెల 20వ తేదీతో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోనుంది.75 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన అఖండ ఫుల్ రన్ లో మరింత ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించే ఛాన్స్ అయితే ఉంది.అఖండ టైటిల్ సాంగ్ రిలీజ్ కావడంతో బాలయ్య అభిమానులు సంతోషంగా ఫీలవుతున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య తన సోదరి అయిన పురంధేశ్వరి ఇంటికి వచ్చారు.నిన్న బాలయ్య కారంచేడు ప్రాంతంలో భోగి పండుగ సంబరాలు జరుపుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.సంక్రాంతి పండుగ రోజున బాలకృష్ణ గుర్రంపై ఎక్కి సందడి చేశారు.గుర్రంతో కలిసి బాలయ్య డ్యాన్స్ స్టెప్పులు వేయించగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

బాలయ్యను చూడటానికి అభిమానులు పెద్దఎత్తున పురంధేశ్వరి ఇంటి దగ్గరకు చేరుకుంటున్నారు.

Telugu Akanda, Akhanda, Balakrishna, Bham Akhanda, Boyapati, Pragya Jaiswal, Sankranthi, Sankranti Gift, Tollywood-Movie

అయితే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో పురంధేశ్వరి ఇంటిలోకి బాలయ్య అభిమానులను అనుమతించడం లేదని సమాచారం.త్వరలో బాలయ్య తరువాత సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు.క్రాక్ విడుదలైన తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తిస్థాయిలో ఈ సినిమా స్క్రిప్ట్ కు పరిమితమయ్యారు.

బాలయ్య కొరకు గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ఫిక్స్ అయిందని సమాచారం.

#Balakrishna #Boyapati #Sankranti Gift #Bham Akhanda #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube