పండుగ పూట హైదరాబాద్ లో జోరుగా ఆన్ లైన్ వ్యభిచారం...  

One Person Arrest In Hyderabad-crime News,hyderabad,hyderabad Latest News,hyderabad News,one Person

హైదరాబాదు నగరం రోజురోజుకి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.ఇందులో ముఖ్యంగా చదువుకోవడానికి వస్తున్నటువంటి యువతే ప్రధాన లక్ష్యంగా చేసుకొని కొంతమంది వ్యభిచార గృహ నిర్వాహకులు అందమైన యువతలను ఎరగా వేస్తూ వారి జీవితాలను నాశనం చేస్తున్నారు.

One Person Arrest In Hyderabad-crime News,hyderabad,hyderabad Latest News,hyderabad News,one Person-Telugu Trending Latest News Updates One Person Arrest In Hyderabad-crime News Hyderabad Latest One-One Person Arrest In Hyderabad-Crime News Hyderabad Latest

తాజాగా ఓ ప్రముఖ పబ్ లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన ఘటన మరువక ముందే మరో వ్యభిచార నిర్వాహక ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

వివరాల్లోకి వెళితే ఎస్ఆర్ నగర్లో నివాసముంటున్నఇద్దరు యువకులు ఓ ప్రముఖ వెబ్ సైట్ ఆధారంగా చేసుకొని అందమైన యువతుల ఫోటోలు ఉంచి అందులో విటులు ఎంచుకున్న యువతులను వారికి సరఫరా చేస్తూ అడ్డదారిలో డబ్బులు సంపాదించకుంటున్నరు.

ఇందులో భాగంగా విటులకు ఎంచుకున్న యువతులను వారికి సరఫరా చేస్తూ గంటకు దాదాపు 5 వేల నుంచి 10వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.

అయితే స్థానికుల నుంచి పోలీసులకి సమాచారం రావడంతో పోలీసులు ఆ యువకులు ఉన్నటువంటి నివాసం పై దాడి చేశారు.ఈ దాడిలో ఓ యువకుడు పోలీసులకి చిక్కగా మరో యువకుడు పరారీలో ఉన్నాడు.అలాగే ఆ నివాసంలో వ్యభిచారంలో పాల్గొంటున్నటువంటి మరో నలుగురు యువకులను మరియు యువతులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

అంతేగాక పరారీలో ఉన్నటువంటి మరో నిందితుడి కోసం పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

తాజా వార్తలు