సంక్రాంతి సినిమాలు ఎంత సంపాదించాయో తెలుసా?

Sankranthi Movies Business 2022

ప్రతి ఏటా సంక్రాంతికి సినిమా పరిశ్రమలో మంచి పోటీ ఉంటుంది.భారీ సినిమాలు థియేటర్లలో రిలీజై సందడి చేస్తాయి.

 Sankranthi Movies Business 2022-TeluguStop.com

కానీ ఈ సారి సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల కాలేదు.చిన్నా చితకా సినిమాలు మాత్రమే వచ్చాయి.

వాస్తవానికి సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలు కరోనా కారణంగా తప్పుకున్నాయి.ఈ నేపథ్యంలో నాలుగు చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి.

 Sankranthi Movies Business 2022-సంక్రాంతి సినిమాలు ఎంత సంపాదించాయో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అవి బంగార్రాజు, రౌడీ బాయ్స్, హీరో, సూపర్ మచ్చి.

ఈ నాలుగు సినిమాల్లో భారీ చిత్రం బంగర్రాజు.

ఈ సినిమాతో పాటు రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి 14న విడుదల అయ్యాయి.సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు రావడంతో జనాల్లో ఇంట్రెస్ట్ పెరిగింది.

అటు నాగార్జున, నాగ చైతన్యతో పాటు రమ్య క్రిష్ణ లాంటి వారు నటించడంలో ఈ సినిమాకు క్రేజ్ వచ్చింది.

దీంతో ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.అటు హీరో మూవీ ఇవాళ రిలీజ్ కానుంది.అయితే సంక్రాంతికి వచ్చన 4 సినిమాల్లో వారసులు ఎంట్రీ ఇచ్చారు.

హీరో మూవీతో మహేష్ ఫ్యామిలీ నుంచి గల్లా అశోక్ పరిచయం అయ్యాడు.రౌడీ బాయ్స్ తో దిల్ రాజు ఫ్యామిలీ నుంచి ఆశిష్ రెడ్డి పరిచయం అయ్యాడు.

ఇక ఆయా సినిమాల బిజినెస్ చూస్తే హీరో మూవీ 12 కోట్లతో నిర్మిస్తే 8 కోట్లు బిజినెస్ జరిగింది.మంచి టాక్ తో ముందుకు సాగుతుంది.అటు రౌడీ బాయ్స్ బడ్జెట్ 12 కోట్లు.నైజాం ఆంధ్రాలో దిల్ రాజ ఈ మూవీని ఓన్ రిలీజ్ చేశారు.మిగతా ఏరియాల్లో ఈ మూవీకి 6 కోట్లు వచ్చాయి.ఇక బంగార్రాజు భారీ మొత్తాలకు అమ్ముడు పోయింది.

ఈ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ 39 కోట్లు.మొత్తంగా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలు బాగానే వసూళ్లు చేశాయి అని చెప్పుకోవచ్చు.

#Bangarraju #Nagarjuna #Machhi #Ashish Reddy #Sankranthi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube