2023 సంక్రాంతి రేస్ లో ఆరు సినిమాలు.. ఈసారి రసవత్తర పోటీకి స్టార్స్ సిద్ధం!

సంక్రాంతి.మన టాలీవుడ్ లో సీజన్ ఇదే.2022 సంక్రాంతి ఫైట్ ఒక రేంజ్ లో ఉంటుంది అని కోరుకున్న ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది.అయితే వారి ఆశలన్నిటిపై స్టార్స్ నీళ్లు చల్లారు.

 Sankranthi 2023 Fight Declare, Sankranthi 2023, Sankranthi, Sankranthi 2023 Fight, Tollywood, Megastar Bhola Shankar, Rc15, Harihara Veeramallu, Adipurush-TeluguStop.com

కరోనా కారణంగా ఒక్కో సినిమా వాయిదా పడుతూ వహ్చింది.దీంతో భారీ సినిమాలు చాలా వరకు సర్దేయడంతో చివరకు చిన్న సినిమాలు మాత్రమే మిగిలాయి.దాంతో ప్రేక్షకులు ఈ ఏడాది సంక్రాంతికి బిగ్ ఫైట్ మిస్ అయ్యారు.

2022 సంక్రాంతికి ట్రిపుల్ సినిమాతో పాటు, రాధేశ్యామ్ సినిమాలు రావడంతో మధ్యలో ఎందుకు అని భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేసుకున్నారు.అంతకు ముందే మహేష్ సర్కారు వారి పాట వాయిదా వేసుకున్నారు.ఇలా ట్రిపుల్ ఆర్ కారణంగా కూడా పెద్ద సినిమాలు వాయిదా వేసుకున్నారు.ఇక అప్పటి ఆశలను మళ్ళీ 2023 సంక్రాంతికి వైపుకు మళ్లించారు ప్రేక్షకులు.

 Sankranthi 2023 Fight Declare, Sankranthi 2023, Sankranthi, Sankranthi 2023 Fight, Tollywood, Megastar Bhola Shankar, RC15, Harihara Veeramallu, Adipurush-2023 సంక్రాంతి రేస్ లో ఆరు సినిమాలు.. ఈసారి రసవత్తర పోటీకి స్టార్స్ సిద్ధం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వచ్చే సంక్రాంతికి దాదాపు ఆరు సినిమాలు పోటీ పడనున్నాయి.దీంతో ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారింది.2023 సంక్రాంతికి ఇంకా చాలా నెలలు ఉండడంతో ఏ స్టార్ హీరో ఏ సినిమాతో పోటీకి వస్తాడో అని ఎదురు చూస్తున్నారు.అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ పోటీలో ఆరు సినిమాలు ఉన్నాయని తెలుస్తుంది.

Telugu Adipurush, Bhola Shankar, Rc, Sankranthi, Tollywood-Movie

రామ్ చరణ్ – శంకర్ ప్రాజెక్ట్ ఆర్సీ 15, వంశీ పైడిపల్లి-విజయ్ కలయికలో వస్తున్న రెండు సినిమాలు సంక్రాంతి బరిలోనే దిగాలని అనుకుంటున్నారట.ఈ సంక్రాంతికి మిస్ అయినా మహేష్ త్రివిక్రమ్ తో చేసే సినిమా సంక్రాంతికే రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడట.అలాగే పవన్ కళ్యాణ్ క్రిష్ కలిసి చేస్తున్న హరిహర వీరమల్లు కూడా సంక్రాంతి సీజన్ లోనే రానున్నదని సమాచారం.

అలాగే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా 2023 సంక్రాంతికే అని టాక్ వినిపిస్తుంది.ఇంకా మెగాస్టార్ భోళా శంకర్ కూడా వచ్చే సంక్రాంతికే రావొచ్చని టాక్ వినిపిస్తుంది.

ఇలా పెద్ద పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube