సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Sankranthi 2022 Telugu Movies Specialties Bangarraju Rowdy Boy Super Machi Hero

సినిమా పరిశ్రమకు కొన్ని సీజన్లు ఉంటాయి.సంక్రాంతి, సమ్మర్ సహా పలు సమయాల్లో సినిమాలను విడుదల చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తారు.

 Sankranthi 2022 Telugu Movies Specialties Bangarraju Rowdy Boy Super Machi Hero-TeluguStop.com

జనాలను బాగా ఆకర్షించి మంచి వసూళ్లు అందుకోవాలి అనుకుంటారు.ఈ ఏడాది కూడా సంక్రాంతికి పలు సినిమాలు విడుదల కాబోతున్నాయి.

జనాలను అలరించబోతున్నాయి.వాస్తవానికి ఈ సంక్రాంతి బరిలో రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఉంటుందని అందరూ భావించారు.

 Sankranthi 2022 Telugu Movies Specialties Bangarraju Rowdy Boy Super Machi Hero-సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో స్పెషాలిటీ ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సంక్రాంతికే సినిమాను విడుదల చేస్తున్నట్లు జక్కన్న ప్రకటించాడు కూడా.కానీ చివరి నిముషంలో ఆయన మనసు మార్చుకున్నాడు.

సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు.ఆయన సినిమా లేకపోవడంతో పలు సినిమాను సంక్రాంతి బరిలో నిలిచాయి.

అయితే ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలకు ఓ కామన్ పాయింట్ ఉంది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సంక్రాంతి సందర్భంగా నాలుగు సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి.ఆ సినిమాలు బంగార్రాజు, రౌడీ బాయ్స్, సూపర్ మచ్చి, హీరో.సినిమాల్లో హీరో 15న విడుదల కానుంది.మిగతా మూడు సినిమాలు 14న రిలీజ్ అవుతున్నాయి.

బంగార్రాజు సినిమాలో నాగార్జునతో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కలిసి నటించారు.రౌడీ బాయ్స్ సినిమాలో దిల్ రాజు బ్రదర్ కొడుకు ఆశిష్ హీరోగా నటిస్తున్నాడు.

సూపర్ మచ్చి సినిమాలో చిరంజీవి చిన్నల్లుగు కల్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్నాడు.హీరో సినిమాతో మహేష్ బాబు మేనల్లుడు గ‌ల్లా అశోక్ జనాలకు పరిచయం కాబోతున్నాడు.

ఈ మూడు సినిమాల్లో నాగార్జున మినహాయిస్తే.మిగిలిన నలుగురు హీరోలకు ఇదే ఫస్ట్ సంక్రాంతి.బంగార్రాజు సినిమాతో చైతన్య మొదటి సారి జనాలను సంక్రాంతి నాడు పలుకరిస్తున్నాడు.అటు సూపర్ మచ్చితో కల్యాణ్ దేవ్ కూడా నాగ చైతన్య బాటలోనే పయనిస్తున్నాడు.అటు తొలిసారి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న గల్లా అశోక్, ఆశిష్ కూడా తొలిసారి సంక్రాంతి బరిలో నిలిచారు.వీరిలో ఎవరి సినిమాలు జనాలను బాగా ఆకట్టుకుంటాయో చూడాలి.

sankranthi 2022 telugu movies specialties bangarraju rowdy boy super machi hero details, sankranthi, sankranthi 2022 movies, common point, nagarjuna, naga chaitanya, bangarraju, kalyan dev, chiranjeevi, super machi, mahesh babu, gall ashok, hero, dil raju, ashish, rowdy boys - Telugu Ashish, Bangarraju, Chiranjeevi, Common Point, Dil Raju, Gall Ashok, Kalyan Dev, Mahesh Babu, Naga Chaitanya, Nagarjuna, Rowdy, Sankranthi, Machi

#Nagarjuna #Sankranthi #Bangarraju #Chiranjeevi #Naga Chaitanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube