సంక్రాంతి బరిలోకి నాలుగు సినిమాలు.. చివర వరకు తగ్గకుండా ఉంటారా..!

మన టాలీవుడ్ లో పండగలకు సినిమాలు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది.అందులో మరీ ముఖ్యంగా సంక్రాంతి పండగ సీజన్ మాత్రం మన హీరోలందరికీ ఇష్టం.

 Sankranthi 2022 Season Box Office Movies-TeluguStop.com

అప్పుడు సినిమాలు విడుదల చేస్తే కలెక్షన్ల సునామీ రావడం ఖాయం.కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన రికార్డ్ స్థాయి కలెక్షన్లు వస్తాయి.

అందుకే సంక్రాంతి పండుగకు ముందుగానే డేట్స్ బ్లాక్ చేసుకుంటారు దర్శక నిర్మాతలు.

 Sankranthi 2022 Season Box Office Movies-సంక్రాంతి బరిలోకి నాలుగు సినిమాలు.. చివర వరకు తగ్గకుండా ఉంటారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే 2022 సంక్రాంతి బరిలోకి ఇప్పటి నుండే పోటీ మొదలయ్యింది.

ఈసారి సంక్రాంతికి ఇప్పటి వరకు నాలుగు సినిమాలు లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది.ఎప్పటి నుండో సంక్రాంతి సీజన్ కు కర్చీఫ్ వేసి మరి ముందు వరుసలో ఉన్నాడు సూపర్ స్టార్ట్ మహేష్ బాబు.

ఈయన నటించిన గత సినిమా సరిలేరు నీకెవ్వరూ కూడా సంక్రాంతి బరిలోకి దిగి రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టి సూపర్ హిట్ అయ్యింది.

Telugu Ari Hara Veera Mallu, Beast, F3 Movie, Mahesh Babu, Pawan Kalyan, Sankranthi 2022, Sankranthi 2022 Season Box Office Movies, Sarkaru Vaari Paata, Vijay Thalapathy-Latest News - Telugu

ఈసారి కూడా ”సర్కారు వారి పాట” సినిమాతో సంక్రాంతి బరిలోకి దూకబోతున్నాడు.ఈ సినిమాను పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

ఆ తర్వాత వరుసలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు.ఈయన క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ”హరిహర వీరమల్లు” సినిమాను కూడా సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని చూస్తున్నారు.

Telugu Ari Hara Veera Mallu, Beast, F3 Movie, Mahesh Babu, Pawan Kalyan, Sankranthi 2022, Sankranthi 2022 Season Box Office Movies, Sarkaru Vaari Paata, Vijay Thalapathy-Latest News - Telugu

ఆ తర్వాత లిస్టులో అనిల్ రావిపూడి చేస్తున్న ”ఎఫ్ 3” సినిమా కూడా ఉంది.ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుంటే తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది.ఆ తర్వాత సినిమా తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమా కూడా సంక్రాంతి బరిలోకి రాబోతుందని తెలుస్తుంది.ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరి చూడాలి ఈసారి సంక్రాంతి బరిలోకి చివరి వరకు ఎవ్వరు ఉండబోతున్నారో.

#Sankranthi2022 #AriHara #Sankranthi 2022 #Pawan Kalyan #SarkaruVaari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు