ఆ నెల మొత్తం సినిమాలే సినిమాలు  

Sankranthi 2019 Telugu Movies Releases-nishabdham Movie,sankranthi 2019 Movies,sarileru Neekevvaru

తెలుగు సినిమాలకు మంచి సీజన్‌ అంటే సంక్రాంతి మరియు దసరా.ఈ రెండు సీజన్‌లలో ఖచ్చితంగా పెద్ద హీరోల సినిమాలు రెండు మూడు అయినా వస్తాయి.కొన్ని సార్లు ఎక్కువ కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి.పలు సంక్రాంతి సీజన్‌లలో తెలుగు స్టార్‌ హీరోలు వచ్చిన విషయం తెల్సిందే.ఇక ఈసారి సంక్రాంతి సీజన్‌కు ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ రంగంలోకి దిగబోతున్న నేపథ్యంలో సంక్రాంతి సీజన్‌ మరింత రసవత్తరంగా మారింది.

Sankranthi 2019 Telugu Movies Releases-nishabdham Movie,sankranthi 2019 Movies,sarileru Neekevvaru Telugu Tollywood Movie Cinema Film Latest News-Sankranthi 2019 Telugu Movies Releases-Nishabdham Movie Sankranthi Sarileru Neekevvaru

అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో మరియు మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో సంక్రాంతికి ముందు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాలు రెండు కూడా సంక్రాంతి సీజన్‌ను ఫుల్‌గా వాడేసుకుంటున్నాయి.ఈ రెండు సినిమాలకు పోటీగా అన్నట్లుగా ఎంత మంచివాడవురా అంటూ కళ్యాణ్‌ రామ్‌ రాబోతున్నాడు.ఈ మూడు సినిమాలు కాస్త గ్యాప్‌ తో లేదంటే ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Sankranthi 2019 Telugu Movies Releases-nishabdham Movie,sankranthi 2019 Movies,sarileru Neekevvaru Telugu Tollywood Movie Cinema Film Latest News-Sankranthi 2019 Telugu Movies Releases-Nishabdham Movie Sankranthi Sarileru Neekevvaru

ఇక సంక్రాంతి సీజన్‌ తర్వాత కూడా మూడు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.డిస్కోరాజా సినిమాను జనవరి 26న విడుదల చేయాలని నిర్ణయించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.ఇదే సమయంలో సంక్రాంతి తర్వాత అన్నట్లుగా అనుష్క హీరోయిన్‌గా నటించిన నిశబ్దం చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు చిన్న సినిమాలు రిపబ్లిక్‌ డే సందర్బంగా విడుదల కాబోతున్నాయి.కనుక జనవరి నెల మొత్తం సినిమాలతో మస్త్‌ మజా ఇవ్వడం కన్ఫర్మ్‌ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.