మనం చేసే కార్యాలు దిగ్విజయం కావాలంటే ఈ వ్రతం చేయాల్సిందే!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు తప్పకుండా ఆ కార్యంలో ఎటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా, ఆ కార్యం దిగ్విజయంగా పూర్తవ్వాలని మొదటిగా ఆ విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహిస్తారు.ఈ విధంగా పూజలు నిర్వహించడం ద్వారా మన జీవితంలో ఏర్పడే సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటారని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

 Importance Of Sankatahara Chaturthi Vratham, Life Deeds, Kuja Dosham,vigneshwar,-TeluguStop.com

కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి.ఇలాంటి సమస్యలకు పరిహారంగా వినాయకుడికి పూజలు నిర్వహించాలి.

అయితే సంకష్టహర చతుర్దశి రోజు ఈ పూజలు చేయటం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.అయితే ఆరోజు ఎప్పుడు వస్తుంది? పూజ ఏ విధంగా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం…

తిథులలో వినాయకుడికి ఎంతో ఇష్టమైనది చవితి.అయితే ఈ చవితి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది.ఒకసారి అమావాస్య తరువాత, పౌర్ణమి తరువాత ఈ తిథులు వస్తాయి.

అమావాస్య తర్వాత వచ్చే చవితిని వరద చతుర్థి అని అంటారు.అలాగే పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని అంటారు.

వరద చతుర్థి వ్రతాన్ని కేవలం వినాయకచవితి రోజు మాత్రమే నిర్వహించి పూజలు చేస్తారు.

సంకటహర చతుర్థి వ్రతం మంగళవారం రోజున వస్తే దానిని అంగారక చతుర్థి అని కూడా అంటారు.

ఇది ఎంతో శుభకరమైన చతుర్థి.ఈ రోజు వినాయకుడికి వ్రతం చేసేవారు రోజంతా కఠిన ఉపవాసాలు ఉండి పూజ చేయటం ద్వారా వారి జీవితంలో ఏర్పడినటువంటి కుజ దోషాలు తొలగి పోవడమే కాకుండా, చేసేటటువంటి పనులలో ఆటంకములు అన్ని తొలగిపోయి, ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో విజయాలను అందుకుంటారు.

అయితే ఈ వ్రతాన్ని ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో ఈ వ్రతాన్ని నిర్వహించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube