సముద్రం వీడి గాలిలోకి ఎగురుతున్న డైరెక్టర్  

Sankalp Reddy Next Movie On Indian Air Force - Telugu Bollywood News, Indian Air Force, Sankalp Reddy, The Ghaazi Attack

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి బాహుబలి చిత్రం తరువాత నటించిన ఘాజీ చిత్రం ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషలన్ హిట్ మూవీగా నిలిచింది.

 Sankalp Reddy Next Movie On Indian Air Force

ఇక ఈ సినిమా సముద్రం గర్భంలో రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

సముద్రం వీడి గాలిలోకి ఎగురుతున్న డైరెక్టర్-Gossips-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమా తరువాత సంకల్ప్ రెడ్డి ఎలాంటి సినిమాతో వస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.అయితే వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘అంతరిక్షం’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించాడు సంకల్ప్ రెడ్డి.

ఈ సినిమా మొత్తం అంతరిక్షం బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పెద్దగా సక్సెస్ కాలేదు.

ఇక ప్రస్తుతం మరో సినిమాను తెరకెక్కించేందుక సంకల్ప్ రెడ్డి రెడీ అవుతున్నాడు.

ఈసారి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌పై సినిమా తీసేందుకు సంకల్ప్ రెడ్డి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు ఈ కుర్ర డైరెక్టర్ సిద్ధం అవుతున్నాడు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో విద్యుత్ జమాల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.కాగా వీలైనంత త్వరగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సంకల్ప్ రెడ్డి రెడీ అవుతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sankalp Reddy Next Movie On Indian Air Force Related Telugu News,Photos/Pics,Images..

footer-test