ఐపీఎల్ లో అన్ని ఫిక్సింగ్ మ్యాచ్ లే అంటున్న బుకీ… ఏదీ నిజం కాదు  

Sanjeev Chawla Claims All Cricket Matches Are Fixed, IPL Cricket, Indian Cricket, Match Fixing, BCCI - Telugu Bcci, Indian Cricket, Ipl Cricket, Match Fixing, Sanjeev Chawla Claims All Cricket Matches Are Fixed

ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఐపీఎల్ కి ముందు, ఐపీఎల్ తర్వాత అని చెప్పాలి.టి-20 సిరీస్ లు క్రికెట్ లోకి ప్రవేశించాక క్రికెట్ వేగం అందుకుంది.ఎంతో మంది ఆటగాళ్ళు ఈ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చారు.కోట్ల రూపాయిలు డబ్బు క్రికెటర్స్ చేతుల్లోకి వచ్చి పడుతుంది.దేశవాళీ ఆటగాళ్ళు కూడా కోటీశ్వరులుగా మారిపోతున్నారు.ఇక విదేశీ ఆటగాళ్ళు కూడా ఐపీఎల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

 Sanjeev Chawla Claims All Cricket Matches Are Fixed

వేల కోట్ల రూపాయిల పెట్టుబడితో సాగే ఈ ఐపీఎల్ లో బయటకి వచ్చిన ఆటగాళ్ళతో పాటు, మ్యాచ్ ఫిక్సింగ్ ల ద్వారా కెరియర్ నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.అందులో శ్రీశాంత్ లాంటి టాలెంటెడ్ క్రీడాకారులు ఉన్నారు.

ఐపీఎల్ మాటున లక్షల కోట్ల బ్లాక్ మార్కెట్ వ్యాపారం బెట్టింగ్ రూపంలో జరుగుతుంది.

ఐపీఎల్ లో అన్ని ఫిక్సింగ్ మ్యాచ్ లే అంటున్న బుకీ… ఏదీ నిజం కాదు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ బెట్టింగ్ మాఫియాలో చిక్కుకొని ఎంతో మంది జీవితాలు నాశనం చేసుకున్నారు.

రోడ్డున పడ్డారు.ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఇక ఈ ఐపీఎల్ లో ఎంతో మంది మేనేజ్మెంట్ సభ్యులు కూడా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడుపుతున్నారు.అయితే ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లో ఫిక్సింగ్ జరుగుతాయని యూకేలో ఉంటున్న బుకీ సంజీవ్ చావ్లాని సంచలన వాఖ్యలు చేశారు.అతనిని అరెస్ట్ ఇండియాకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.2000 సంవత్సరంలో జరిగిన అతి పెద్ద క్రికెట్ స్కామ్‌లో కీలక పాత్ర పోషించిన అతను తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఏ క్రికెట్ మ్యాచ్ కూడా న్యాయంగా జరగదు అని అతను అన్నాడు.ప్రతీ మ్యాచ్ ఫిక్స్‌డ్‌యే.ప్రతీ మ్యాచ్ వెనుక ఓ పెద్ద మాఫియా ఉంది.ఎవరో డైరెక్ట్ చేసిన సినిమాలా మ్యాచ్‌లు జరుగుతాయి.

వీటి వెనుక ఉన్నవాళ్లు చాలా ప్రమాదకరం.మనం ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరు అని చావ్లా తెలిపాడు.

మొత్తానికి అతని వాఖ్యల ద్వారా ఐపీఎల్ మ్యాచ్ లు ఏవీ నిజం కాదనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు