కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ల‌కు కార‌ణం చెప్పిన సంజ‌య్‌.. అస‌లు క‌థ వేరే ఉంద‌ట‌!

ఇప్ప‌టి వ‌ర‌కు హుజూరాబాద్ రాజ‌కీయాలు ఓ మోస్త‌రుగా న‌డుస్తున్నా నిన్న ఒక్క‌సారిగా వేడెక్కాయి.కార‌ణం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌.

 Sanjay Says The Reason For The Kcr Tourthe Original Story Is Different-TeluguStop.com

ఆయ‌న నిన్న హుజూరాబాద్‌లో జ‌రిగిన ప‌దాధికారుల స‌మావేశానికి రావ‌డంతోనే ఈట‌ల రాజేంద‌ర్‌కు పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.అలాగే అంద‌రు బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను క‌లిసి రావాలంటూ స‌మాయ‌త్తం చేశారు.

దీంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు గేర్లు మార్చ‌కున్నాయి.దీంతో అటు టీఆర్ ఎస్‌లో కాస్త టెన్ష‌న్ మొద‌లైంది.

 Sanjay Says The Reason For The Kcr Tourthe Original Story Is Different-కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ల‌కు కార‌ణం చెప్పిన సంజ‌య్‌.. అస‌లు క‌థ వేరే ఉంద‌ట‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక వ‌స్తూనే కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు బండి సంజ‌య్‌.ప్ర‌స్తుతం అమ్ముతున్న భూములు పేదోళ్ల‌వ‌ని, అవి కాకుండా టీఆర్ ఎస్ నేత‌లు క‌బ్జా చేసిన ప్ర‌భుత్వ భూముల‌ను అమ్ముకోవాల‌ని చెప్పారు.

ఇక కేసీఆర్ ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డానికి కార‌ణం ఈట‌ల రాజేంద‌ర్ అని చెప్పి ట్విస్టు ఇచ్చారు.ఈట‌ల రాజేంద‌ర్ దెబ్బ‌తోనే కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నాడ‌ని చెప్పారు.

Telugu About Kcr Tour, Bandi Sanjay, Eetala Rajendhar, Etal, Harish Rao, Huzurabad, Kcr, Kcr Tour, Politics, Telengana, Trs, Ts Poltics-Telugu Political News

కేసీఆర్ ఇప్పుడు అనూహ్యంగా అన్ని జిల్లాల పర్యటనకు వెళ్ల‌డానికి కార‌ణం కూడా ఈట‌ల రాజేంద‌రే అని స్ప‌ష్టం చేశారు.ఎక్కడ ఈట‌ల రాజేంద‌ర్‌కు అన్యాయం చేశామ‌నే వ్య‌తిరేకత వ‌స్తుందో అని కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నార‌ని, అందుకే ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న‌ట్టు వివ‌రించారు.ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే బండి సంజ‌య్ మాట‌ల‌తో ఒక్క‌సారిగా ఈట‌ల‌కు క్రేజ్ వ‌చ్చేసింద‌ని చెప్పాలి.ప్ర‌స్తుతం రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఉన్న బండి సంజ‌య్‌కు చెక్ పెట్టేందుకే ఈట‌ల‌ను తీసుకొచ్చార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న టైమ్‌లో ఆయ‌న ఈట‌ల‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్త‌డంతో ఈట‌ల‌కు పార్టీలో కూడా బేస్ పెరుగుతుంద‌ని చెప్పాలి.

అయితే బండిసంజ‌య్ ఈట‌ల‌ను త‌న వ‌ర్గంలో చేర్చుకోవ‌డానికి ఈ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.మ‌రి ఈట‌ల ఎవ‌రి వ‌ర్గంలో ఉంటారు అనేది వేచి చూడాలి.

#Huzurabad #Ts Poltics #Politics #About Kcr Tour #KCR Tour

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు