షారుఖ్ ఖాన్-బన్సాలీ దేవదాస్ కాంబో... మళ్ళీ ప్రేమ కథతోనే

బాలీవుడ్ లో స్టార్ దర్శకుల జాబితాలో సంజయ్ లీలా బన్సాలీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఆయన సినిమాలు ఏవైనా కాని బాలీవుడ్ టాప్ మూవీల జాబితాలో ఉంటాయి.

 Sanjay Leela Bhansalis Next With Shahrukh Khan-TeluguStop.com

ప్రస్తుతం అలియా భట్ తో గంగూబాయ్ ఖతియావాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ కి రెడీకి అయ్యింది.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది. అలియా భట్ ఈ సినిమాలో గంగూబాయ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించిందని చెప్పాలి.

 Sanjay Leela Bhansalis Next With Shahrukh Khan-షారుఖ్ ఖాన్-బన్సాలీ దేవదాస్ కాంబో… మళ్ళీ ప్రేమ కథతోనే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ ఉంది.ఎక్కువగా పీరియాడిక్ ప్రేమకథలని తెరపై అద్బుత దృశ్య కావ్యంగా సంజయ్ లీలా బన్సాలీ ఆవిష్కరించి తనదైన ముద్ర వేశారు.

ఆయన దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ లో వచ్చిన దేవదాస్ సినిమా బాలీవుడ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే.ఇక షారుఖ్ ఖాన్ కెరియర్ లో కూడా వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా దేవదాస్ నిలిచిపోయింది.

అతని ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.ఇదిలా ఉంటే 22 ఏళ్ల తర్వాత షారుఖ్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీ జత కడుతున్నారు.ఇక ఈ సినిమాకి ఇజ్హార్ అనే టైటిల్ కూడా ఖరారు చేసారని తెలుస్తుంది.ఇక దీంట్లో ప్రేమకథనే చెప్పడానికి బన్సాలీ రెడీ అయినట్లు తెలుస్తుంది.

పీరియాడిక్ టచ్ లోనే హిస్టోరికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథని ఇజ్హార్ ద్వారా తెరపై ఆవిష్కరించడానికి బన్సాలీ రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తుంది.ప్రస్తుత షారుఖ్ ఖాన్ సిద్ధార్ద్ ఆనంద్ దర్శకత్వంలో పఠాన్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇది పూర్తయిన తర్వాత బన్సాలీ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

#Shah Rukh Khan #SanjayLeela #Siddharth Anand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు