అలాంటి మాటలతో వేధించాడు.. స్టార్ హీరో కూతురు ఎమోషనల్..?

స్టార్ హీరోలు, స్టార్ హీరోల పిల్లలు విలాసవంతంగా జీవనం సాగిస్తారని వాళ్ల రియల్ లైఫ్ లో ఎలాంటి కష్టాలు ఉండవని చాలామంది అనుకుంటారు.అయితే వాళ్లలో కొంతమంది మాత్రం ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు.

 Sanjay Dutts Daughter Opens Up  About Her  Relationshiop , Opens Up, Relationshi-TeluguStop.com

సంజయ్ దత్ బాలీవుడ్ నటుడిగా మనందరికీ సుపరిచితమే.ఒక దశలో వరుస విజయాలతో దూసుకెళ్లిన సంజయ్ దత్ డ్రగ్స్ కు అడిక్ట్ కావడంతో పాటు జైలుకెళ్లడం ద్వారా వార్తల్లో నిలిచారు.

అయితే ఈ హీరో కూతురు తన లవ్ ఎఫైర్ గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సంజయ్ దత్ మొదటి భార్య కూతురైన త్రిషాల దత్ తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్లతో తాజాగా ముచ్చటించడంతో పాటు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిచ్చారు.

ఒక నెటిజన్ త్రిషాల దత్ ను ఎప్పుడైనా మోసపోయారా.? అని ప్రశ్నించగా ఆమె యస్ అని బదులిచ్చారు.

లాంగ్ లాస్టింగ్ రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించగా తన లాంగ్ లాస్టింగ్ రిలేషన్ షిప్ ఏడు సంవత్సరాలని అయితే ఆ రిలేషన్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను మాత్రం తాను వెల్లడించలేనని ఆమె అన్నారు.ఇద్దరికి కొన్ని విషయాల్లో డిఫరెన్సెస్ వచ్చాయని ప్రస్తుతం తాను రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉన్నారని త్రిషాల దత్ పేర్కొన్నారు.

Telugu Relationship, Sanjay Dutt, Trishala Dutt-Movie

తను రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి తన ఫ్రెండ్స్ ను తన నుంచి దూరం చేశాడని తాను బయటకు వెళ్లినా ఏదో చేయకూడని తప్పు చేసినట్టు వేధింపులకు గురి చేసేవాడని రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో ఎదుర్కొన్న కష్టాల గురించి త్రిషాల దత్ చెప్పుకొచ్చారు.త్రిషాల దత్ రిలేషన్ షిప్ వల్ల ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube