కట్టప్ప ఫస్ట్ టార్గెట్ ఆయనే!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పాడు జక్కన్న.ఇక ఈ సినిమాలో ప్రభాస్ చేసిన పాత్రకంటే కూడా ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేసింది కట్టప్ప పాత్ర.

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న దాదాపుగా ఓ ఏడాది పాటు ప్రేక్షకులను అయోమయానికి గురిచేసింది.

అయితే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన కట్టప్ప పాత్రలో సత్యరాజ్ పూర్తిగా ఒదిగిపోయాడు.

ఆ పాత్రతో సత్యరాజ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.అయితే ఈ కట్టప్ప పాత్ర కోసం తొలుత వేరే నటుడిని అనుకున్నాడట రాజమౌళి.

ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.కట్టప్ప పాత్రలో నటించేందుకు రాజమౌళి తొలుత బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను తీసుకోవాలని అనుకున్నారట.

కానీ ఆ సమయంలో సంజయ్ దత్ జైలులో ఉండటంతో వారు ఈ పాత్రను సత్యరాజ్ వద్దకు తీసుకెళ్లారు.

ఇలా ఓ బాలీవుడ్ నటుడు సెన్సేషనల్ పాత్రను మిస్ చేసుకున్న సంగతి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి-2 ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో యావత్ ప్రపంచానికి తెలిసిందే.

కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌కు పట్టిన బూజును ఈ సినిమా దులిపేసింది.ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నాలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్, శివగామి పాత్రలో రమ్యకృష్ణ అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నారు.

కాంగ్రెస్ కు ఓట్లు అడిగే హక్కు లేదు..: కిషన్ రెడ్డి