కట్టప్ప ఫస్ట్ టార్గెట్ ఆయనే!  

Sanjay Dutt Was First Choice For Kattappa, Sanjay Dutt, Rajamouli, Baahubali, Kattappa, Tollywood News - Telugu Baahubali, Kattappa, Rajamouli, Sanjay Dutt, Tollywood News

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పాడు జక్కన్న.

 Sanjay Dutt Rajamouli Baahubali Kattappa

ఇక ఈ సినిమాలో ప్రభాస్ చేసిన పాత్రకంటే కూడా ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేసింది కట్టప్ప పాత్ర.బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న దాదాపుగా ఓ ఏడాది పాటు ప్రేక్షకులను అయోమయానికి గురిచేసింది.

అయితే ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన కట్టప్ప పాత్రలో సత్యరాజ్ పూర్తిగా ఒదిగిపోయాడు.ఆ పాత్రతో సత్యరాజ్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

కట్టప్ప ఫస్ట్ టార్గెట్ ఆయనే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ కట్టప్ప పాత్ర కోసం తొలుత వేరే నటుడిని అనుకున్నాడట రాజమౌళి.ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

కట్టప్ప పాత్రలో నటించేందుకు రాజమౌళి తొలుత బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను తీసుకోవాలని అనుకున్నారట.కానీ ఆ సమయంలో సంజయ్ దత్ జైలులో ఉండటంతో వారు ఈ పాత్రను సత్యరాజ్ వద్దకు తీసుకెళ్లారు.

ఇలా ఓ బాలీవుడ్ నటుడు సెన్సేషనల్ పాత్రను మిస్ చేసుకున్న సంగతి ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి-2 ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో యావత్ ప్రపంచానికి తెలిసిందే.

కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌కు పట్టిన బూజును ఈ సినిమా దులిపేసింది.ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నాలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కట్టప్ప పాత్రలో సత్యరాజ్, శివగామి పాత్రలో రమ్యకృష్ణ అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్నారు.

#Sanjay Dutt #Rajamouli #Baahubali #Kattappa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sanjay Dutt Rajamouli Baahubali Kattappa Related Telugu News,Photos/Pics,Images..