మున్నాభాయికి నెల రోజుల పెరోల్

మున్నాభాయి ఎవరో అందరికీ తెలుసు.ఒకప్పటి బాలివుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్.

 Sanjay Dutt Gets 30-day Parole-TeluguStop.com

అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలు రుజువు కావడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతీ తెలిసిందే.ప్రస్తుతం ఆయన నెల రోజుల పెరోల్ మీద బయటకు వచ్చారు.

సంజయ్ కూతురి ముక్కుకు ఆపరేషన్ చేయాల్సి ఉంది.కూతురికి ఆపరేషన్ అంటే తండ్రికి ఆందోళనగానే ఉంటుంది కదా.కూతురికి ఆపరేషన్ చేయాల్సి ఉంది కాబట్టి తాను ఆమె దగ్గర ఉండాలని, కాబట్టి నెల రోజులు పెరోల్ ఇవ్వాలని అధికారులను వేడుకున్నాడు.దీంతో మానవీయ కోణంలో పెరోల్ మంజూరైంది.

పెరోల్ ఇవ్వడాన్ని ఎవరూ తప్పు పట్టరుగాని, సంజయ్ తరచుగా జైలు నుంచి బయటకు వస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి.ఆయనకు వీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని అంటున్నారు.

గత ఏడాది డిసెంబరులో పెరోల్ మీద బయటకు వచ్చారు.తన పెరోల్ పొడిగించాలని కోరినా అధికారులు ఒప్పుకోలేదు.2013 మే నుంచి 2014 ఆఖరు వరకు 118 సార్లు జైలునుంచి బయటకు వచ్చారు.తీవ్రమైన నేరం మీద శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికీ ఇన్నిసార్లు బయటకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం విచిత్రమే.

అందుకే సంజయ్ కి వీఐపీ మర్యాదలు చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి.సంజయ్ దత్ కు 2007లో ఆరేళ్ళ జైలు శిక్ష పడింది.18 నెలలు జైల్లో ఉంది బెయిల్ మీద బయటకు వచ్చి తనకు శిక్ష విధించడం పై కోర్టులో సవాలు చేసాడు.2013 దాకా కోర్టులో పోరాడిన తరువాత పూణే జైలుకు తరలించారు.సంజయ్ దత్ చివరిసారిగా గత ఏడాది అమీర్ ఖాన్ సూపర్ హిట్ పీకే చూసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube