బాలయ్యను ఢీకొట్టేది ఇతడే.. బాక్సులు బద్దలే!  

Sanjay Dutt Finalized Villain In Balakrishna Movie, Balakrishna, Boyapati Sreenu, Sanjay Dutt, Tollywood News - Telugu Balakrishna, Boyapati Sreenu, Sanjay Dutt, Tollywood News

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు.కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టారు చిత్ర యూనిట్.

 Sanjay Dutt Finalized Villain In Balakrishna Movie

అయితే కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.కాగా ఈ సినిమాలో బాలయ్య మాస్ లుక్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.

కాగా ఈ సినిమా టీజర్‌ను బాలయ్య పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.ఈ టీజర్‌లో బాలయ్యను చాలా పవర్‌ఫుల్‌గా చూపించాడు దర్శకుడు బోయపాటి.

బాలయ్యను ఢీకొట్టేది ఇతడే.. బాక్సులు బద్దలే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండేలా చిత్ర దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.ఇందులో భాగంగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను ఈ సినిమాలో విలన్‌గా నటించాల్సిందిగా చిత్ర యూనిట్ గతంలోనే ఆయన్ను కోరారు.

కానీ ఆయన ఈ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడట.

అయితే పట్టువదలని బాలయ్య, ఈ సినిమాలో ఎలాగైనా సంజయ్ దత్ నటిస్తే బాగుంటుందని తెలపడంతో బోయపాటి సంజయ్ దత్‌ను ఈ సినిమాలో నటించేలా ఒప్పించాడట.

దీంతో ఈ సినిమాలో సంజయ్ దత్ బాలయ్యను ఢీకొట్టే సన్నివేశాలు ఎలా ఉండనున్నాయా అనే సందేహం సర్వత్రా నెలకొంది.ఇక ఈ సినిమాలో ముంబైకి చెందిన ఓ కొత్త బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమాలో బాలయ్యను ఢీకొట్టే పాత్రను ఎంత పవర్‌ఫుల్‌గా చూపించనున్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Boyapati Sreenu #Sanjay Dutt #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sanjay Dutt Finalized Villain In Balakrishna Movie Related Telugu News,Photos/Pics,Images..