అధీరా లుక్‌తో ఔరా అనిపించిన సంజయ్ దత్

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది.

 Sanjay Dutt Adheera Look From Kgf 2 Released, Sanjay Dutt, Adheera, Kgf 2, Tolly-TeluguStop.com

ఇక ఈ సినిమాతో కన్నడ హీరో యష్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.

ఇక ఈ సినిమా అందించిన భారీ విజయంతో ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ను తెరకెక్కిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా విలన్ పాత్ర అధీరాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.అల్ట్రా స్టైలిష్ లుక్‌లో సంజయ్ దత్ విలన్‌గా ఇరగదీసాడు.

అధీరా అనే పేరుకు పర్ఫెక్ట్‌గా ఈ లుక్ ఉన్నట్లు కనిపిస్తుంది.ఇక ఈ సినిమాలో విలన్ పాత్రను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసే విధానం అత్యద్భుతంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా కేజీఎఫ్ చాప్టర్ 2 వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుననారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube