కరణం మల్లీశ్వరిగా మారబోతున్న రకుల్ ప్రీత్ సింగ్  

Rakul Preet Singh Title Role In Karnam Malleswari Biopic, Director Sanjana Reddy, MVV Satyanarayana, Tollywood - Telugu Director Sanjana Reddy, Mvv Satyanarayana, Rakul Preet Singh Title Role In Karnam Malleswari Biopic, Tollywood

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పీరియాడికల్ స్టోరీస్, బయోపిక్ కథలు ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నాయి.కొత్త దర్శకుల నుంచి స్టార్ దర్శకుల వరకు అందరూ ఇలాంటి కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

 Sanjana Reddy Mvv Satyanarayana Rakul Preet Singh Karnam Malleswari

అయితే పీరియాడికల్ కథలలో ఎమోషనల్ టచ్ ఎక్కువగా ఉంటుంది, అలాగే బయోపిక్ కథలలో కూడా ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయి.వీటిని తెరపై అంతే హృద్యంగా ఆవిష్కరిస్తే హిట్ బొమ్మ గ్యారెంటీ అని నమ్ముతున్నారు.

బాలీవుడ్ లో ఇప్పటికే బయోపిక్ ఫార్ములాతోనే ఎక్కువ హిట్స్ కొడుతున్నారు.ఇక తెలుగులో ఫస్ట్ ప్రయారిటీ పీరియాడికల్ కథలకి ఇస్తే రెండో ప్రాధాన్యత బయోపిక్ స్టోరీస్ కి ఇస్తున్నారు.

కరణం మల్లీశ్వరిగా మారబోతున్న రకుల్ ప్రీత్ సింగ్-Movie-Telugu Tollywood Photo Image

అందులో భాగంగా తాజాగా తెరపైకి వచ్చింది కరణం మల్లేశ్వరి బయోపిక్.

విశాఖ ఎంపీ, నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.

ఇక సంజనా రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించనుంది. కోన వెంకట్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి సినిమా మీద అంచనాలు పెంచారు.త్వరలో క్యాస్టింగ్ ఫైనల్ చేస్తారనగా కరోనా లాక్ డౌన్ తో సినిమాకి సంబందించిన అన్ని పనులు ఆగిపోయాయి.

దర్శకురాలు ఆ మధ్య అనారోగ్యానికి గురి కావడంతో కొంత విరామం ఇచ్చింది.అయితే మళ్ళీ ఈ సినిమా టైటిల్ రోల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ముందుగా బాలీవుడ్ భామలో ఎవరో ఒకరిని తీసుకోవాలని భావించిన తాజాగా తెరపైకి రకుల్ ప్రీత్ సింగ్ పేరు వచ్చింది.కరణం మల్లీశ్వరి బయోపిక్ కోసం రకుల్ ని ఫైనల్ చేశారని టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది.

త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుందని సమాచారం.

#DirectorSanjana #RakulPreet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sanjana Reddy Mvv Satyanarayana Rakul Preet Singh Karnam Malleswari Related Telugu News,Photos/Pics,Images..