నన్ను చంపేయచ్చు కదా.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..?  

sandalwood actress sanjana galrani sensational comments about drugs case, sanjana, sensational comments, drugs case, corona, lock down, engagement, movie offers, marriage, sandalwood - Telugu Corona, Drugs Case, Engagement, Lock Down, Marriage, Marriagesanjana, Movie Offers, Sandalwood, Sanjana, Sanjana Galrani, Sensational Comments

సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు సినిమాల్లో బాగా నటిస్తే నటిగా ఎంత మంచి పేరు వస్తుందో ఏదైనా వివాదాల్లో చిక్కుకుంటే అదే స్థాయిలో చెడ్డపేరు వస్తుంది. శాండిల్ వుడ్ నటి సంజనా కొన్ని నెలల క్రితం డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - Sanjana Galrani Sensational Comments About Drugs Case

కొన్ని రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన సంజన డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం, తనపై కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్లు చేయడం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ప్రయాణం చేసే రోడ్ రఫ్ గా ఉందని తనకు అర్థమైందని.

TeluguStop.com - నన్ను చంపేయచ్చు కదా.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఆ రఫ్ గా ఉన్న రోడ్డును దాటి మళ్లీ పైకి ఎగరాలని అనుకుంటున్నానని ఆమె అన్నారు.గత కొన్ని నెలల నుంచి తాను ఏడుస్తూనే ఉన్నానని.ఏడ్చీఏడ్చీ తన కంట్లో కన్నీళ్లు కూడా అయిపోయాయని తెలిపారు.అయితే తనకు ఏ సమస్య ఎదురైనా నవ్వుతూ ఆ సమస్యను నవ్వుతూ సాధించాలని అనుకున్నానని తెలిపారు.

న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని.కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని వెల్లడించారు.

తన పెళ్లి గురించి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో తన నిశ్చితార్థం జరిగిందని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.అయితే ఎంగేజ్ మెంట్ గురించి ప్రకటించాలని అనుకున్నా ప్రకటించే అవకాశం లేకుండా పోయింది.తన పెళ్లి గురించి మాట్లాడుతూ మ్యారేజ్ ను గ్రాండ్ గా కాకుండా చిన్న వేడుకలా జరుపుకోవాలని భావిస్తున్నానని తెలిపారు.ఛారిటబుల్ ట్రస్ట్ లో తన పెళ్లి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

గతంలో కూడా పలువురు సినీ తారలు డ్రగ్స్ కేసులో చిక్కుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.డ్రగ్స్ కేసులో చిక్కుకున్న తరువాత చాలామంది నటీమణులకు సినిమా ఆఫర్లు కూడా తగ్గాయి.

సంజన మళ్లీ సినిమా ఆఫర్లతో బిజీ అవుతారో లేదో చూడాల్సి ఉంది.

#Engagement #Drugs Case #Marriage #Lock Down #Sandalwood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు