ప్రభాస్ హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్..! వైరల్ ఫోటో

తెలుగు సినీ నటి సంజన గల్రానీ.మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని వెండితెరకు పరిచయమయింది ఈ ముద్దుగుమ్మ.

 Sanjana Galrani Secrect Marriage, Snajana Galrani, Secrect Marrige, Prabahas, Sh-TeluguStop.com

తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నటించిన సంజన బుల్లితెరలో కూడా కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటుంది.

2005లో సోగ్గాడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాగా ఆ తరువాత ఇతర భాషల్లో కూడా కొన్ని సినిమాలలో నటించింది.ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా సత్యమేవ జయతే వంటి పలు సినిమాలలో నటించింది.ఇక ఇదిలా ఉంటే తాజాగా ఆమె సీక్రెట్ మ్యారెజ్ చేసుకోగా ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త ,డాక్టర్ పాషా ను సంజన సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది.పరిమిత సంఖ్యలో స్నేహితులు, బంధువులు వీళ్ల పెళ్లికి హాజరయ్యారు.ఇక వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.అంతేకాకుండా సంజనా డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఆత్మనిర్భర్ అనే పేరుతో నటీనటుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నాలు చేస్తుంది.ఇక వీటి గురించి పక్కనబెడితే డిజిటల్ మీడియా కు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తానంటూ ప్రకటించింది.

Telugu Prabahas, Secrect Marrige, Shasha, Snajana Galrani-Movie

ఇదిలా ఉంటే సంజన గత ఏడాది కొన్ని డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.ఇక ఆమె ఆరోగ్యపరమైన సమస్యలు గురించి ఇబ్బంది పడుతున్నందున కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు కర్ణాటక హైకోర్టు.ఇక అప్పటి నుంచి ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటూ సోషల్ మీడియాలో మోటివేషన్ పోస్టులను తెగ షేర్ చేస్తుండేది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube