పెళ్లి గురించి సూక్తులు చెబుతున్న ప్రభాస్ హీరోయిన్  

Sanjana Galrani Comments On Her Love Story, Tollywood, Telugu Cinema, Kollywood, South Cinema - Telugu Kollywood, Sanjana Galrani Comments On Her Love Story, South Cinema, Telugu Cinema, Tollywood

హీరోయిన్ సంజనా గల్రాని అని పరిచయం చేసే కంటే బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లిగా, ప్రభాస్ ని ప్రేమించే అమ్మాయిగా కనిపించిన కన్నడ హీరోయిన్ అంటే వెంటనే అందరికి గుర్తుకొస్తుంది.ఈ మధ్య ఈ అమ్మడు తెలుగు టెలివిజన్ లో స్వర్ణఖడ్గం అనే సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తుంది.

 Sanjana Galrani Love Story Prabhas

కన్నడనాట స్టార్ హీరోయిన్ అయిన సంజనా తెలుగులో ఫేమస్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేసింది.అయితే అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.

ఆమె చెల్లి నిక్కి గల్రాని కూడా తెలుగు, తమిళ సినిమాలలో అడపా దడపా నటిస్తుంది.సంజనా సినిమాల కంటే వివాదాలకి కేరాఫ్ అడ్రెస్స్ గా ఉంటుంది.

పెళ్లి గురించి సూక్తులు చెబుతున్న ప్రభాస్ హీరోయిన్-Movie-Telugu Tollywood Photo Image

ఎప్పుడు ఏదో ఒక వివాదంతో ఈ అమ్మడు సహవాసం చేస్తుంది.అలాగే కన్నడ నాట కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన హీరోయిన్ కూడా ఈమె అని చెప్పాలి.

ఇదిలా ఉంటే ఒక వయసు వచ్చాక హీరోయిన్స్ ని పెళ్లి గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో ఫాన్స్, మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు.పెళ్లి విషయం వచ్చేసరికి అందాల భామలు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో రెస్పాండ్ అవుతారు.

సంజ‌న‌ చాలా రోజులుగా ఒక యువకుడితో ప్రేమలో ఉన్నట్లు గత కొంత కాలంలో వార్త‌లు వచ్చాయి. ఫ్యామిలీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని ప్రచారం జరిగింది.

ఈ విషయంపై తాజాగా ఆమె కాస్తా క్లారిటీ ఇచ్చింది.తాను ప్రేమలో ఉన్న మాట వాస్తవమే అయిన ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానో లేదో తనకు తెలియదని, అలాగే జీవితంలో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో ఎవరికీ తెలియదంటూ ఒక అద్భుతమైన ఉపదేశం కూడా చేసింది.

మొత్తానికి ఈమె మాట బట్టి ప్రేమలో ఉన్న విషయం అయితే క్లారిటీ వచ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sanjana Galrani Love Story Prabhas Related Telugu News,Photos/Pics,Images..