పవన్ ను చూస్తే గుండె ఆగిపోతుంది.. నటి కీలక వ్యాఖ్యలు..?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారనే సంగతి తెలిసిందే.సామాన్యులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలలో చాలామంది పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తున్నారు.

 Sanjana Galrani Interesting Comments On Pawan Kalyan-TeluguStop.com

పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో సంజన గల్రానీ కీలక పాత్రలో నటించారు.తాజాగా ఒక సందర్భంలో సంజన మాట్లాడుతూ పవన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

గతేడాది డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి వార్తల్లో నిలిచిన సంజన తెలుగులో బుజ్జిగాడు సినిమాతో పాపులారిటీని సొంతం చేసుకున్నారు.కర్ణాటకకు చెందిన సంజన కొన్ని కన్నడ సినిమాల్లో కూడా నటించడం గమనార్హం.

 Sanjana Galrani Interesting Comments On Pawan Kalyan-పవన్ ను చూస్తే గుండె ఆగిపోతుంది.. నటి కీలక వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సంజన టాలీవుడ్ హీరోలలో తనకు పవన్ అంటే ఇష్టమని పవన్ ను చూస్తే గుండె కొట్టుకోవడం కూడా ఆగుతుందని ఆమె తెలిపారు.

బాలీవుడ్ లో తనకు షారుఖ్ అంటే ఇష్టమని షారుఖ్ ఖాన్ ను తాను ప్రేమించానని సంజన చెప్పుకొచ్చారు.

Telugu Bollywood, Comments Viral, Megastar Chranjeevi, Oxygern Banks, Pawan Favoruite, Pawan Kalyan, Sanjana Galrani, Sanjjana Galrani, Sardar Gabbar Singh, Shrukh Khan, Snajana Galrani Favorite Hero, Social Service, Tollywood-Movie

సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ తో నటించిన తరువాత తనకు పవన్ పై ప్రేమ, అభిమానం పెరిగాయని ఆమె తెలిపారు.పవన్ లేడీస్ కు చాలా గౌరవం ఇస్తారని పవన్ గౌరవం ఇచ్చే విధానాన్ని చూసి ఇంప్రెస్ అయ్యానని ఆమె తెలిపారు.మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలను సైతం సంజన ప్రశంసించారు.

Telugu Bollywood, Comments Viral, Megastar Chranjeevi, Oxygern Banks, Pawan Favoruite, Pawan Kalyan, Sanjana Galrani, Sanjjana Galrani, Sardar Gabbar Singh, Shrukh Khan, Snajana Galrani Favorite Hero, Social Service, Tollywood-Movie

రోజుకు వెయ్యి మంది చొప్పున 27 రోజులు తాను ఆహారం అందజేశానని సంజన వెల్లడించారు.ఒకవైపు బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తూ మరోవైపు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పడం సాధారణ విషయం కాదని సంజన పేర్కొన్నారు.తనను ఈ స్థాయికి తెచ్చిన వాళ్ల కోసం చిరంజీవి సేవా కార్యక్రమాలను చేస్తున్నారని సంజన వెల్లడించారు.

#Sanjana Galrani #SardarGabbar #Oxygern Banks #Pawan Kalyan #Shrukh Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు