హీరోలందరికి ఒక్క భామ సరిపోవట్లేదేమో! బ్రహ్మోత్సవం లో కాజల్,సమంత,ప్రణీత లతో సూపర్ స్టార్ చిందులేస్తోంటే, రవితేజ “బెంగాల్ టైగర్ ” లో తమన్నా, రాశీ ఖన్నాలను సెట్ చేసుకున్నాడు.మరోవైపు బన్ని సరైనోడులో రకుల్ ప్రీత్ తో పాటు, కెథరీన్ త్రేసా తో ఆడిపాడుతున్నాడు.
నేనేం తక్కువ తిన్నాను అంటు పవర్ స్టార్ కూడా ముగ్గరేసి భామలతో స్టెప్పులేస్తున్నాడు.
సర్దార్ గబ్బర్ సింగ్ లో కాజల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో ఒక స్పెషల్ సాంగ్ లో లక్ష్మీ రాయ్ మెరువనుంది.ఈ సాంగ్ ను ఇప్పటికే షూట్ చేసేసారు.
ఇక ఈ లిస్టులోకి మూడో భామ వస్తోంది.ఆ భామ పేరు సంజన.
ప్రభాస్ బిజ్జిగాడు ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.సర్దార్ లో ఒక పాత్ర లో ఈ భామ కనిపించి గ్లామర్ డోసుని మరింత పెంచనుంది.
సర్దార్ షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ లో జరుగుతోంది.కాజల్ కూడా అక్కడే ఉంది.
డిసెంబర్ రెండొవ వారం వరకు ఈ షెడ్యూలు పూర్తి అవుతుంది అని సమాచారం.వేసవి సెలవులకి సర్దార్ సిద్ధమవుతాడు.