సరిలేరు నీకెవ్వరు సినిమాకు వెళ్లిన హీరోయిన్.. నోటీసులు ఇచ్చిన పోలీసులు  

Sanjana Galrani Gets Notice From Karnataka Police-notice,sanjana Galrani,sarileru Neekevvaru

మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు మహేష్.

Sanjana Galrani Gets Notice From Karnataka Police-Notice Sanjana Sarileru Neekevvaru

ఈ సినిమా చేసేందుకు థియేటర్లకు పరుగులు పెట్టారు ప్రేక్షకులు.ఇక మహేష్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆయన సినిమా వస్తుందంటే సాధారణ ప్రేక్షకుల దగ్గర్నుండి సెలెబ్రిటీల వరకు థియేటర్లకు లైన్ కడతారు.

ఇలానే మహేష్ సినిమాకోసం వెళ్లిన ఓ హీరోయిన్‌కు చేదు అనుభవం మిగిలింది.

సరిలేరు నీకెవ్వరు సినిమాను చూసేందుకు వెళ్తూ ఓ సెల్ఫీ వీడియో దిగిన ఈ బ్యూటీకి కర్ణాటక పోలీసులు ఝలక్ ఇచ్చారు.తనకు ఎంతో ఇష్టమైన మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా చూసేందుకు వెళ్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది.

కాగా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటమే నేరం అంటే, అమ్మడు ఏకంగా వీడియో తీసుకోవడం ఏమిటని పోలీసులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో అమ్మడికి నోటీసులు పంపారు.సినిమాకు వెళ్లడం సరేగాని, ఇలా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి తావివ్వడం ఏమిటని వారు ప్రశ్నించారు.సినిమా చూసేందుకు వెళ్తున్న సంజనా ఇలా చేయడం సబబు కాదంటూ నెటిజన్లు కూడా ఆమెపై ఫైర్ అవుతున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన ఆమెకు పోలీసులు నిజమైన సినిమా చూపిస్తున్నారంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు

Sanjana Galrani Gets Notice From Karnataka Police-notice,sanjana Galrani,sarileru Neekevvaru Related....