పోలీసుల అదుపులో ప్రముఖ నటి...!

ప్రస్తుతం కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కు సంబంధించిన కేసు కలకలం సృష్టిస్తోంది.ఈ కేసుకు సంబంధించి కన్నడ చిత్ర పరిశ్రమలోని నటీనటులకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడంతో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇందుకు సంబంధించి కొంతమంది నటీనటులను ప్రశ్నించడం జరుగుతుంది.

 Acteress Sanjana Arrested By Police  Areested, Kannada Film Industry, Heroien, D-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా తాజాగా ప్రముఖ కన్నడ నటి సంజనను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్‌ కు పోలీసులు తీసుకెళ్లారు.

నేడు ఉదయం హీరోయిన్ సంజన ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ కు తరలించారు.

ఈ డ్రగ్స్ కేసులో నిందితుడిగా తేలిన రాహుల్ శెట్టి ఇచ్చిన సమాచారం తో సంజన నివాసంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఇలా పోలీసులు సెర్చ్ వారెంట్ తీసుకున్న నేపథ్యంలో సంజన ఇంటిపై దాడులు నిర్వహించిన తదుపరి ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో సంబంధించి కన్నడ చిత్ర పరిశ్రమలో మరికొందరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.ఇక ఈ కేసు నేపథ్యంలో రెండో నటి సంజనా కావడం విశేషం.

ఇదివరకే ఈ కేసులో భాగంగా మాదక ద్రవ్యాలు ఉపయోగం, సరఫరా వంటి ఆరోపణలతో నటి రాగిణి ద్వివేది ను కర్ణాటక పోలీసులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.ఏది ఏమైనా ఒక తప్పుడు పనులు చేసేవారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కు సంబంధించి అనేక చిత్రపరిశ్రమలో నటీనటులు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి కూడా విధితమే.ఇది వరకు టాలీవుడ్ పరిశ్రమలో కూడా అనేకమంది ప్రముఖులు ఈ విషయం ఫై ఎన్నో విమర్శలు ఎదురుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube