బిగ్‌బాస్‌ 2.. మొదటి ఎలిమినేషన్‌ ఎవరో తెలిసిపోయింది       2018-06-12   23:04:29  IST  Raghu V

నాని హోస్ట్‌గా బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం అయ్యింది. మొదటి సీజన్‌ సూపర్‌ హిట్‌ అవ్వడంతో రెండవ సీజన్‌ కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం మొదటి నుండి వ్యక్తం అవుతూ వచ్చింది. అయితే సెలబ్రెటీల ఎంపిక విషయంలో స్టార్‌ మా కాస్త తప్పుడు నిర్ణయం తీసుకుందని, ఇద్దరు ముగ్గురు మినహా మరెవ్వరు కూడా సెలబ్రెటీలు తెలిసిన వారు లేరు అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఈ సీజన్‌లో ముగ్గురు సామాన్యులు కూడా హౌస్‌లోకి వెళ్లడం ఆసక్తికర విషయం. ఈ షో మెల్ల మెల్లగా ఆసక్తికరంగా సాగుతుంది. మొదటి రెండు రోజుల పాటు సో సోగానే సాగినప్పటికి మూడవ రోజు నుండి షోలో ట్విస్ట్‌లు మొదలు అయ్యాయి.

-

బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో మొదటి వారం ఎలిమినేషన్‌ పక్రియ ప్రారంభం అయ్యింది. ఓటింగ్‌ కూడా అప్పుడే మొదలు అయ్యింది. మొదటి వారంలో సంజన, దీప్తి, కిరీటి, గణేష్‌లు ఎలిమినేషన్‌ జాబితాలో ఉన్నారు. ఈ నలుగురిలో శనివారం లేదా ఆదివారం ఎలిమినేషన్‌ అయ్యే వ్యక్తి ఎవరు అంటూ ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. బిగ్‌బాస్‌ చూస్తున్న ప్రేక్షకులు ఈ నలుగురికి ఓట్లు వేసి వారిని ఇంట్లోనే ఉంచేలా చేయాలి. వారి ప్రవర్తన బట్టి వారికి లభించే ఓట్లు ఉంటాయి. మొదటి సీజన్‌ మొదటి వారంలో జ్యోతి ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. ఆమె అతి ప్రవర్తన మరియు దుడుకు తనం వల్లే ఆమె మొదటి వారంలోనే బయటకు వచ్చేసింది.

ఇప్పుడు అదే తరహా శైలిలో సంజన ఉన్నారు. సామాన్యురాలిగా హౌస్‌లోకి వెళ్లిన ఆమె సెలబ్రెటీ కంటే ఎక్కువగా యాటిటూడ్‌ చూపిస్తూ అందరికి హడలెత్తిస్తుంది. అందుకే సంజన బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండేందుకు అనర్హురాలు అంటూ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. అందుకే నలుగురు పార్టిసిపెంట్స్‌లో సంజన బయటకు వచ్చే ఛాన్స్‌ ఎక్కువగా ఉందనే టాక్‌ వినిపిస్తుంది. సంజన రెండు రోజుల పాటు జైల్లో ఉంది. దాంతో ఆమెలో కసి పెరిగింది. ఆ కసితో కొందరిని టార్గెట్‌ చేస్తూ ఆమె ప్లాన్‌ చేస్తుంది. ఇలాంటి పద్దతి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎంతమాత్రం కరెక్ట్‌ కాదు.

సంజన ఈ మూడు రోజులు అయినా తన పద్దతి మార్చుకోకుంటే ఖచ్చితంగా బిగ్‌బాస్‌ సీజన్‌ 2 మొదటి ఎలిమినేషన్‌ ఆమెది అవుతుందని అంటున్నారు. సంజన తర్వాత స్థానంలో గణేష్‌ ఉన్నాడు. ఈయన కూడా సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈయన కాస్త మొహమాటంగా, పెద్దగా ఎవరికి పట్టని విధంగా ఉంటున్నాడు. ఈయన కూడా పద్దతి మార్చుకోవాలి. ఇక దీప్తికి సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ ఆమెను బయట పడేస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. మొత్తానికి మొదటి వారంలోనే ఎలిమినేషన్‌ టాలా నాటకీయంగా సాగే అవకాశం ఉంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.