సంజన చేసిన ఆ రెండు తప్పులే ఆమెను ఎలిమినేట్ చేసాయి.! ఇంతకీ అవేంటో తెలుసా.?       2018-06-19   02:55:36  IST  Raghu V

బిగ్ బాస్ సీజన్ – 2లో ఎలిమినేట్ అయిన తొలి సభ్యురాలిగా సంజన నిలిచింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత హౌజ్‌లో ఉన్న ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తేజస్విని ఉద్దేశిస్తూ అతి చేయొద్దని సలహా ఇచ్చింది. సెలబ్రిటీగా ఫీలవ్వొద్దని.. బయట కావొచ్చేమో కానీ.. హౌజ్‌లో కాదని విమర్శించింది. మరోవైపు బాబు గోగినేనిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. గోగినేని కనిపించేంత మంచి వ్యక్తి కాదని… తను చాలా గేమ్ ప్లే చేస్తున్నాడని విమర్శించింది.

అయితే సంజన బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఆ రెండు తప్పులే ఆమెను ఎలిమినేట్ అయ్యేలా చేసాయి. గత వారం రోజులుగా విపరీతమైన ఓవర్ యక్షన్ చేస్తూ బిగ్ బాస్ వీక్షకుల చేత చీవాట్లు తిన్న కారణంగా సంజనపై బిగ్ బాస్ ఫోకస్ పెట్టాడని తెలుస్తుంది.

బిగ్ బాస్ లో గొడవలు పడితేనే గెలవచ్చు అనే నెగిటివ్ లైన్ ని ఎంచుకోవటం సంజన కొంప ముంచింది.ఇలా నెగిటివ్ మైండ్ సెట్ తో ఆడేవాళ్ళకు సంజన గతే పడుతుందని బిగ్ బాస్ డైరెక్ట్ గానే హెచ్చరికలు జారీ చేసాడు.