ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ అందరినీ భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.కరోనా వైరస్ పుణ్యమా అని శానిటైజర్ వినియోగం అమాంతం పెరిగిపోయింది.
ఒకానొక సమయంలో శానిటైజర్ ల కొరత కూడా ఏర్పడింది అనే చెప్పాలి.ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఈ మహమ్మారి వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు శానిటైజర్ ని ఒక ఆయుధంగా వాడుతున్నారు.
అయితే శానిటైజర్ వాడకం ఒక్కసారిగా పెరిగిపోయిన నేపథ్యంలో దీనిపై వైద్యులు కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నారు.ముఖ్యంగా విషపూరిత రసాయనాలు ఉన్న 9 శానిటైజర్ లను అస్సలు వినియోగించకూడదు అంటూ అమెరికా ఎఫ్డిఏ తెలిపింది.
ఎస్క్ బయోకెమ్ సంస్థ తయారు చేసిన శానిటైజర్ లతో ఎంతో ప్రమాదం పొంచి ఉంది అంటూ చెప్పుకొచ్చింది అమెరికా ఎఫ్డిఏ.
ఈ సంస్థ తయారు చేసిన శానిటైజర్ లలో ప్రమాదకర మిథనాల్ ఎక్కువ మోతాదులో ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి వాడడం ద్వారా జలుబు వాంతులు తలనొప్పి వికారం కోమా లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
ఈ సంస్థ తయారు చేసిన ఆల్ క్లీన్ హ్యాండ్ శానిటైజర్, ఎస్క్ బయోకెమ్ హ్యాండ్ శానిటైజర్, క్లీన్ కేర్ నోజెర్మ్ హ్యాండ్ శానిటైజర్, లావర్ 70 జెల్ హ్యాండ్ శానిటైజర్, ది గుడ్ జెల్ యాంటీ బ్యాక్టీరియల్ జెల్ హ్యాండ్ శానిటైజర్, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 70% ఆల్క్‌హాల్, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 100% ఆల్కహాల్, శాండిడెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించొద్దని వినియోగదారులకు ఎఫ్‌డీఏ సూచించింది.