'నా జీవితంలో ఒక రోజు' ఇలా అంటున్న సానియా..!

సానియా మీర్జా ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.

 Sania Says One Day In My Life, Sania Merga, Viral Video, Social Media, Viral New-TeluguStop.com

కేవలం టెన్నిస్ ఆటతోనే కాకుండా తన అందంలోనూ కూడా ఏ మాత్రం తగ్గకుండా అభిమానులను సొంతం చేసుకుంది.మన భారతదేశం లో టెన్నిస్ కు అంత పాపులర్ రావడానికి కూడా ఒక ముఖ్యకారణం సానియా మీర్జా అని చెప్పవచ్చు.

ఆమె ప్రపంచ స్థాయి అగ్ర టెన్నిస్ క్రీడాకారులందర్నీ దీటుగా ఎదుర్కొని పోరాడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది.ఇక తన ఆట శైలితో దేశాన్ని గర్వపడేలా చేసినందుకు భారత ప్రభుత్వం ఆమెకు పద్మభూషణ్, ప్రతిష్టాత్మక అవార్డు రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.

సానియా మీర్జా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం.తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు విషయాలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా సానియా మీర్జా షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోలో భాగంగా సానియా తన జీవితంలో రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ రూపంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది సానియామీర్జా.

ఆ వీడియోకు నా జీవితంలో ఒక రోజు.అంటూ క్యాప్షన్ జత చేసింది.

ఆ వీడియోలో సానియా రోజువారి దినచర్యలను మనం గమనించవచ్చు.అలాగే రోజుల్లో తాను చేసే అన్ని యాక్టివిటీస్ నుషేర్ చేసింది.

సానియా మీర్జా వ్యక్తిగత విషయా నికి వస్తే.పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చింది.ఒకవైపు బిడ్డ యోగక్షేమాలు చూస్తూ మరోవైపు తన అకాడమీ పర్యవేక్షణ చేస్తుంది సానియా.ఇటీవల కాలంలోనే కరోనా వైరస్ బారిన పడిన సానియామీర్జా ఆ సమయంలోనే కోలుకొని మళ్ళీ టెన్నిస్ ఆటలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో ను మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube