వామ్మో.. ఒక్క ఈవెంట్ కు సంగీత అంత తీసుకుంటుందా ?  

sangeetha shocking remuneration for akka evare athagadu show, akka evare athagadu show, sangeetha , sarileru nekevvaru, ETV Special Program, Dasara Event, Rakesh Raghava Skit - Telugu 10 Lakh Rupees, Akka Evare Athagadu Show, Dasara Event, Etv Special Program, Rakesh Raghava Skit, Sangeetha, Sangeetha Shocking Remuneration For Akka Evare Athagadu Show, Sarileru Nekevvaru

రెండు దశాబ్దాల క్రితం సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంగీత.ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ సినిమాల్లో హీరోయిన్ చాన్స్ కోసం ప్రయత్నించే పాత్ర నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

TeluguStop.com - Sangeetha Shocking Remuneration For Akka Evare Athagadu Show

మలయాళం, తమిళ సినిమాలతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన సంగీతకు ఖడ్గం, పెళ్లాం ఊరెళితే, సంక్రాంతి సినిమాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి.
నటిగా సంగీత ప్రూవ్ చేసుకున్నా స్టార్ హీరోల సరసన అవకాశాలు రాకపోవడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కించులేకపోయింది.

ఒక దశలో అవకాశాలు తగ్గిపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన సంగీత మహేష్ బాబు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక తల్లి పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఆమె కెరీర్ కు ప్లస్ అయింది.

TeluguStop.com - వామ్మో.. ఒక్క ఈవెంట్ కు సంగీత అంత తీసుకుంటుందా -Gossips-Telugu Tollywood Photo Image

ఒకవైపు వెండితెరపై మెరుపులు మెరిపిస్తూనే సంగీత బుల్లితెరపై కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.తెలుగులో ప్రముఖ ఛానెళ్లైన ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు ప్రతి పండుగకు ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తాయి.

అలా ఈటీవీ దసరా పండుగకు “అక్కా.ఎవరే అతగాడు” పేరుతో ప్రోగ్రామ్ ను ప్లాన్ చేసింది.

ప్రతిసారి ఇలాంటి కార్యక్రమల్లో రోజా పాల్గొనేది.కానీ ఈసారి మాత్రం ఆమెకు బదులుగా సంగీత వచ్చింది.
ఈ షో కోసం సంగీత భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నారని తెలుస్తోంది.ఈ షోలో స్కిట్ చేసిన రాకేష్ రాఘవ స్కిట్ లో భాగంగా సంగీత పదిలక్షలు తీసుకుంటున్నట్టు కామెంట్ చేశాడు.

దాదాపు రెండున్నర గంటల షో కావడం, హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి కావడంతో సంగీతకు అంత మొత్తం రెమ్యునరేషన్ ఇచ్చి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.

#Sangeetha #RakeshRaghava #ETVSpecial #AkkaEvare #Dasara Event

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sangeetha Shocking Remuneration For Akka Evare Athagadu Show Related Telugu News,Photos/Pics,Images..